Best Web Hosting Provider In India 2024
Science fiction OTT: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ రిలీజ్ కాబోతోంది. కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కల్కి విడుదల అవుతోండగా…నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. కల్కి ఓటీటీ రిలీజ్ డేట్‌ను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాయి.
1200 కోట్ల కలెక్షన్స్…
కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ఫిక్షనల్ వరల్డ్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఆరు వందల కోట్లతో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కమల్‌హాసన్ విలన్…
కల్కి మూవీలో దీపికా పదుకోణ్, అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. సుప్రీమ్ యాశ్కిన్ అనే విలన్‌గా కమల్ హాసన్ కనిపించాడు. ప్రభాస్‌కు జోడీగా దిశా పటానీ కనిపించింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి తో పాటు పలువురు యాక్టర్లు, డైరెక్టర్లు గెస్ట్ పాత్రల్లో కనిపించారు. కల్కి కోసం నాగ్ అశ్విన్ క్రియెట్ చేసిన ఫిక్షనల్ వరల్డ్స్, విజువల్స్‌తో పాటు ప్రభాస్, అమితాబ్‌బచ్చన్ యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.
కల్కి 2898 ఏడీ కథ ఇదే…
కురుక్షేత్రం యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత భూమి మొత్తం నాశనం అవడంతో సుప్రీమ్ యాశ్కిన్ (కమల్‌హాసన్) కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ప్రకృతి వనరులను కాంప్లెక్స్‌కు మాత్రమే పరిమితం చేశాడు. కాశీ నగరంపైన ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లాలన్నది భైరవ (ప్రభాస్) కలలు కంటుంటాడు.
సుప్రీమ్ యాశ్కిన్ అన్యాయాలపై శంబాలా పేరుతో సీక్రెట్ వరల్డ్‌ను ఏర్పాటుచేసుకొని రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. కాంప్లెక్స్ వరల్డ్ నుంచి గర్భంతో ఉన్న సుమతి (దీపికా పదుకోణ్) తప్పించుకుంటుంది. సుమతిని తమకు అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ (శశ్వతా ఛటర్జీ) భైరవతో ఒప్పదం కుదుర్చుకుంటాడు. కానీ భైరవతో పాటు కమాండర్ మానస్ మనుషుల బారి నుంచి సుమతిని అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) కాపాడుతాడు.
అశ్వత్థామ ఎవరు? సుమతిని మానస్‌కు అప్పగించి కాంప్లెక్స్‌లోకి వెళ్లలనుకున్న భైరవ చివరకు అతడి బారి నుంచి ఆమెను ఎందుకు కాపాడాడు? వేల ఏళ్లుగా అశ్వత్థామ బతికి ఉండటానికి కారణం ఏమిటి? శంబాలపై మానస్ చేసిన దాడిని మరియమ్మ (శోభన), వీరతో ఆమె మనుషులు ఎలా ఎదుర్కొన్నారు? భైరవకు మహాభారతంతో ఉన్న సంబంధం ఏంటి? అన్నదే కల్కి మూవీ కథ.
సీక్వెల్….
కల్కి మూవీలో భైరవగా, కర్ణుడిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించాడు. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఎక్కువగా భైరవ నేపథ్యాన్ని చూపించారు. సెకండ్ పార్ట్‌లో కర్ణుడి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కల్కి సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటికే 30 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
Best Web Hosting Provider In India 2024
Source / Credits