Best Web Hosting Provider In India 2024
Prabhas: ప్రభాస్ స్పీడు మామూలుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ సీక్వెల్‌లో నటిస్తోన్న ప్రభాస్ తాజాగా మరో మూవీని మొదలుపెట్టాడు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. పూజా కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొన్నట్లు వెల్లడించింది.
ఫొటోలు, వీడియోలు వైరల్…
కొత్త సినిమా పూజలో ప్రభాస్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మూడో వారం నుంచి మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎవరన్నది ఆగస్ట్ నెలాఖరులోగా క్లారిటీ రానున్నట్లు తెలిసింది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామా…
ప్రభాస్, హను రాఘవపూడి మూవీ పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతోన్నారు.
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతోన్నారు. .
మృణాల్ ఠాకూర్ హీరోయిన్…
ప్రభాస్, హను రాఘవపూడి మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. హను రాఘవపూడి సీతారామంతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సీత పాత్రలో తన నటనతో తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసింది మృణాల్.
ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రభాస్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండటంతో మృణాల్‌నే మరోసారి కథానాయికగా తీసుకోవాలని హను రాఘవపూడి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ కల్కి మూవీలో మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్‌లో నటించింది.
కల్కి 1200 కోట్లు…
ప్రభాస్ గత మూవీ కల్కి ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. కల్కి 2898 ఏడీ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో కమల్ హాసన్ విలన్‌గా నటించాడు.
దీపికా పదుకోణ్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. కల్కి మూవీకి సీక్వెల్ రాబోతోంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మొదలుపెట్టారు. వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికామోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits