Best Web Hosting Provider In India 2024
Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో కబడ్డీ ఆటగాళ్లు కోట్లు ధర పలికారు. క్రికెటర్లతో సమానంగా కోట్లు వెచ్చింది కబడ్డీ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజ్‌లు సొంతం చేసుకున్నది. ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం ఆగస్ట్ 15, 16 తేదీల్లో జరిగింది. ఈ వేలంలో రైడర్ సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
అతడిని రెండు కోట్ల పదిహేను లక్షలకు తమిళ తలైవాస్ దక్కించుకున్నది. సచిన్ తర్వాత మహ్మద్ రెజా అత్యధిక ధర పలికాడు. రెండు కోట్ల ఏడు లక్షలకు రెజాను హర్యాణా స్టీలర్స్ సొంతం చేసుకున్నది. ఈ వేలంలో గమన్ సింగ్ కోటి తొంభై ఏడు లక్షలకు అమ్ముడుపోయాడు.
పవన్ సెహ్రావత్…
స్టార్ ప్లేయర్ పవన్ సెహ్రావత్‌ను మరోసారి తెలుగు టైటాన్స్ వేలంలో కొనుగోలు చేసింది. కోటి డెబ్బై లక్షల ఇరవై ఐదు వేలకు పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్ దక్కించుకున్నది. కబడ్డీ వేలంలో పవన్ కోసం తెలుగు టైటాన్స్‌తో పాటు ఇతర ఫ్రాంచైజ్‌లు పోటీ పడ్డాయి.
కోటి కంటే ఎక్కువ…
కబడ్డీ వేలంలో భరత్ (కోటి ముప్పై లక్షలు), మణిందర్ సింగ్ (కోటి పదిహేను లక్షలు), అజింక్య పవార్ (కోటి పది లక్షలు), సునీల్ కుమార్ (కోటి) అత్యధిక ధర పలికారు.
పర్దీప్ నర్వాల్…
సీనియర్ ప్లేయర్ పర్దీప్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ కేవలం 70 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసింది. సుర్జీత్ సింగ్ 60 లక్షలు, ఫజల్ అత్రఛలి 50 లక్షలకు మాత్రమే ధర పలికారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన డిఫెంటర్‌గా యు ముంబాకు చెందిన సునీల్ కుమార్ నిలవడం గమనార్హం. హయ్యెస్ట్ రేటుకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా మహ్మద్ రెజా రికార్డ్ క్రియేట్ చేశాడు.
రాహుల్ చౌదరికి నిరాశ…
ప్రో కబడ్డీ లీగ్‌కు ఆదరణ పెరగడానికి కారణమైన స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరికి వేలంలో నిరాశే ఎదురైంది. కబడ్డీ వేలంలో అతడిని కొనడానికి ఏ ఫ్రాంచైజ్‌లు ముందుకు రాలేదు. ప్రో కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్స్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పిన రాహుల్ చౌదరి ఈ సారి వేలంలో మాత్రం అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలాడు. రాహుల్ చౌదరితోపాటు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ గులియా, విశాల్ భరద్వాజ్, దీపక్ హుడా, రోహిత్ కుమార్, సురేందర్ నాడా, మోనులను ఏ ఫ్రాంచైజ్‌లు కొనలేదు.
Best Web Hosting Provider In India 2024
Source link