Best Web Hosting Provider In India 2024
Thangalaan Producer KE Gnanavel Raja Comments: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్‌లోకి వచ్చి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించగా నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
నమ్మకాన్ని నిలబెట్టింది
తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని “తంగలాన్” నిలబెట్టిందని ఆయన అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తంగలాన్ సక్సెస్ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు.
200 కోట్ల వరకు రాబడుతుంది
– “తంగలాన్” సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్‌తో మేము ఆశ్చర్యపోతున్నాం. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ గారి కెరీర్‌లో ఇవే హయ్యెస్ట్ ఓపెనింగ్స్. 200 కోట్ల రూపాయల వరకు రాబడుతుందని ఆశిస్తున్నాం.
డిమాంటీ కాలనీ 2 కూడా
– అందుకే టీమ్ థియేట్రికల్ విజిట్‌కు వెళ్తున్నారు. ఆడియెన్స్‌కు తంగలాన్‌ను మరింత చేరువచేయాలని ప్రయత్నిస్తున్నాం. విక్రమ్ గారు కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ కూడా వెళ్లారు. తమిళంలో తంగలాన్‌తో పాటు డిమాంటీ కాలనీ 2 కూడా రిలీజైంది. తంగలాన్‌కు బిగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిమాంటీ కాలనీ 2 కూడా బాగానే ఆడుతోంది.
అన్ని భాషల్లో 30న రిలీజ్
– తెలుగులో మాతో పాటు 15న రిలీజైన అన్ని సినిమాలూ బాగా ఆడాలని కోరుకున్నాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా. తంగలాన్‌కు థియేటర్స్ పెరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లో స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. హిందీలో మూడు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే అక్కడ మా సినిమాను 30వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. మిగతా అన్ని భాషల్లోనూ 30న తంగలాన్ రిలీజ్‌కు రాబోతోంది.
నేచర్ కూడా శిక్షిస్తుంది
– మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని మనమంతా నమ్ముతాం. కొందరు దేవుడిని విశ్వసిస్తారు. మరికొందరు కర్మను నమ్ముతారు. మనం తప్పు చేస్తే ఏదో చెడు జరుగుతుందనే ఫీల్ కలుగుతుంటుంది. నేచర్ కూడా అలాగే. తప్పు చేస్తే నేచర్ (ప్రకృతి) కూడా శిక్షిస్తుంది. మాళవిక మోహనన్ ఆరతి క్యారెక్టర్ ఆ భావనతో క్రియేట్ చేశారు దర్శకుడు పా రంజిత్. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే.
ప్రతి పాత్రకు ప్రశంసలు
– తంగలాన్‌లో చియాన్ విక్రమ్ గారితో పాటు పార్వతీ, మాళవిక, పశుపతి.. ఇంకా ప్రతి ఒక్కరి పాత్రల నటనకు ప్రశంసలు వస్తున్నాయి. వారు ఆ పాత్రలుగా మారిపోయారు. బయట చూస్తే మీరు వారిని గుర్తుపట్టలేరు. అంత సహజంగా పర్‌ఫార్మ్ చేశారు. షూటింగ్ టైమ్‌లో చాలా మందికి గాయాలు అయ్యాయి. వారికి టైమ్ ఇచ్చి మళ్లీ షెడ్యూల్ చేసుకుంటూ వచ్చాం.
Best Web Hosting Provider In India 2024
Source / Credits