Brahmamudi Promo: ధాన్య‌ల‌క్ష్మి ఈగోకు రాజ్ బ‌లి – కావ్య‌ను డ‌బ్బు మ‌నిషిగా తేల్చిన భ‌ర్త – వ‌సుధార‌పై స‌రోజ ప్ర‌తీకారం

Best Web Hosting Provider In India 2024


Brahmamudi Promo: దుగ్గిరాల కుటుంబాన్ని విడ‌గొట్టి ఆస్తి ద‌క్కించుకోవాల‌ని రుద్రాణి స్కెచ్ వేస్తుంది. ధాన్య‌ల‌క్ష్మిని పావుగా వాడుకుంటూ గొడ‌వ‌లు సృష్టిస్తుంది. రుద్రాణి చెప్పుడు మాట‌లు న‌మ్మిన ధాన్య‌ల‌క్ష్మి….త‌న కొడుకు క‌ళ్యాణ్‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ర‌చ్చ‌ ర‌చ్చ చేస్తుంది. రాజ్ రాజ‌భోగాలు అనుభ‌విస్తుంటే త‌న కొడుకు క‌ళ్యాణ్ రోడ్డు పాల‌య్యాడ‌ని గొడ‌వ‌లు చేస్తుంది.

ఆస్తుల‌ను వాటాల‌ను పంచాల్సిందేన‌ని డిమాండ్ చేస్తుంది. ఆస్తి కోస‌మే రాజ్‌, అప‌ర్ణ‌ను బుట్ట‌లో వేసుకున్న కావ్య…క‌ళ్యాణ్ తిరిగి ఇంటికిరావ‌డానికి ఒప్పుకోవ‌డం లేద‌ని నింద‌లు వేస్తుంది. ఈ ఆస్తి త‌న‌ది అని, అమ్మ‌డానికి, పంచ‌డానికి తాను ఒప్పుకునేది లేద‌ని ధాన్య‌ల‌క్ష్మికి సీతారామ‌య్య షాకిస్తాడు.

కావ్య వాద‌న‌…

ధాన్య‌ల‌క్ష్మి ప‌డుతోన్న ఆవేద‌న‌కు న్యాయం చేసేందుకు క‌ళ్యాణ్ ఇంటికి తిరిగి వ‌చ్చే వ‌ర‌కు రాజ్ ఆఫీస్ బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉండాల‌ని సీతారామ‌య్య తీర్పు ఇస్తాడు. సీతారామ‌య్య తీర్పును ఒక్క కావ్య త‌ప్ప అంద‌రూ అంగీక‌రిస్తారు. ఈ తీర్పు వ‌ల్ల ఎవ‌రికి మంచి జ‌ర‌గ‌ద‌ని కావ్య అంటుంది.

ధాన్య‌ల‌క్ష్మి అహం కోసం కంపెనీని దెబ్బ‌తీయ‌డం క‌రెక్ట్ కాద‌ని, త‌ర‌త‌రాలుగా సంపాదించిపెట్టిన పేరుప్ర‌ఖ్యాతులు, విలువ‌లు మొత్తం నాశ‌న‌మ‌వుతాయ‌ని సీతారామ‌య్య‌తో కావ్య వాదిస్తుంది.

రాజ్ అసహనం…

సీతారామ‌య్య‌కు కావ్య ఎదురుచెప్ప‌డం రాజ్ స‌హించ‌లేక‌పోతాడు. బెడ్‌రూమ్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత కావ్య‌తో గొడ‌వ‌కు దిగుతాడు. భ‌ర్త‌కు ధీటుగా స‌మాధానం ఇస్తుంది కావ్య‌. సీతారామ‌య్య నిర్ణ‌యం త‌ప్ప‌ని ఖ‌రాఖండిగా చెబుతుంది. క‌ళ్యాణ్‌ను ఇంటికి తిరిగి ర‌మ్మ‌ని అడిగేవారు ఎవ‌రూ లేరు. క‌ళ్యాణ్ కూడా ఇంటికి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని భ‌ర్త‌తో అంటుంది కావ్య‌. మీరు ఆఫీస్‌కు వెళ్ల‌క‌పోతే కంపెనీ ప‌రిస్థితి ఏమ‌వుతుందోన‌ని కావ్య ఆందోళ‌న ప‌డుతుంది.

కావ్యకు అవమానం…

మ‌ధ్య‌లో నీకెంటి బాధ అంటూ కావ్య‌పై రాజ్ ఫైర్ అవుతాడు. నేను మీ భార్య‌ను…అడిగే హ‌క్కు నాకు ఉంద‌ని కావ్య భ‌ర్త‌కు బ‌దులిస్తుంది. కావ్య మాట‌ల‌తో రాజ్ హ‌ర్ట్ అవుతాడు. నీకు ఆస్తుల మీద‌, ఐశ్వ‌ర్య మీద మోజు ఏమ‌న్న పెరిగిపోయిందా అంటూ అనుమానిస్తాడు. అందుకేనా క‌ళ్యాణ్ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నావ‌ని భార్య‌ను అనుమానిస్తాడు రాజ్‌. భ‌ర్త మాట‌ల‌తో కావ్య షాక‌వుతున్న‌ట్లుగా బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో క‌నిపిస్తోంది. క‌ళ్యాణ్ బాగుప‌డాల‌నే అత‌డు తిరిగి ఇంటికి రావొద్ద‌ని తాను వేసిన ప్లాన్‌ను భ‌ర్త‌కు కావ్య చెబుతుందా? లేదా? అన్న‌ది బ్ర‌హ్మ‌ముడి నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

స‌రోజ ప్లాన్‌…

రంగా రూపంలో ఉన్న రిషిని త‌మ ఊరికి తిరిగి తీసుకెళ్లాల‌ని స‌రోజ ప్ర‌య‌త్నిస్తుంది. స‌రోజ వెంట వెళ్ల‌డానికి రిషి ఒప్పుకోడు. వ‌సుధార ట్రాప్‌లో రిషి ప‌డ్డాడ‌ని స‌రోజ అనుమానిస్తుంది. వ‌సుధార అడ్డు తొల‌గిపోతేనే బావ త‌న‌తో పాటు వ‌స్తాడ‌ని అనుకుంటుంది. వ‌సుధార‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఫిక్స‌వుతుంది. త‌న‌ను మ‌హేంద్ర‌, వ‌సుధార‌తో పాటు అనుప‌మ మోసం చేసింద‌ని ప‌గ‌తో ర‌లిగిపోతాడు మ‌ను. నిజం తెలియ‌న‌ట్లుగా న‌టిస్తూనే మ‌హేంద్ర‌ను దెబ్బ‌కొట్టేందుకు ప్లాన్ వేస్తాడు. వారి నోటితోనే ఆ నిజాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టించాల‌ని మ‌ను అనుకుంటాడు.

ఫైన‌ల్ స్కెచ్‌…

ఎండీ సీట్ ద‌క్కిన‌ట్లే ద‌క్కి చేజారిపోవ‌డంతో శైలేంద్ర త‌ట్టుకోలేక‌పోయాడు. రిషి త‌న‌కు తానుగా ఎండీ సీట్ త‌న‌కు ఇచ్చేలా ఫైన‌ల్‌గా ఓ స్కెచ్ వేస్తాడు. అదేమిట‌న్న‌ది గుప్పెడంత మ‌న‌సు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే…

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024