Telugu OTT: తెలుగు కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – బాల‌కృష్ణ సినిమా చుట్టూ తిరిగే క‌థ‌

Best Web Hosting Provider In India 2024


Telugu OTT: తెలుగు కామెడీ డ్రామా మూవీ బాలుగాని టాకీస్ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. బాలుగాని టాకీస్ మూవీ రిలీజ్ డేట్‌ను తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షోలో ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ 13న ఈ కామెడీ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. బాలుగాని టాకీస్ మూవీలో శివ‌రామ‌చంద్ర‌వ‌ర‌పు, శ‌ర‌ణ్య శ‌ర్మ హీరోహీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు.

బాల‌కృష్ణ అభిమాని క‌థ‌…

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న బాలుగాని టాకీస్ క‌థ మొత్తం బాల‌య్య సినిమా చుట్టూ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో హీరో శివ రాంచంద్ర‌వ‌ర‌పు బాల‌కృష్ణ అభిమానిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించారు.

త‌న టాకీస్‌లో బాల‌కృష్ణ సినిమాను రిలీజ్ చేయాల‌న్న‌ది అత‌డి క‌ల‌. ఆ క‌ల నెర‌వేరే క్ర‌మంలో బాలుకు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? బాల‌కృష్ణ సినిమాకు బాలు ప్రేమ‌క‌థ‌కు ఏమ‌న్న సంబంధం ఉందా? అనే అంశాల‌తో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు వీడియో చూపించారు.

బాల‌కృష్ణ క‌టౌట్‌…

బాలుగాని టాకీస్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే స‌హ‌జ‌త్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వీడియోలో పాత‌కాలం సినిమా సినిమా టికెట్‌, దానిపై ఇర‌వై రూపాయ‌ల ధ‌ర‌తోపాటు టికెట్ ఒక్క ఆట‌కే చెల్ల‌బ‌డును. మార్చ‌బ‌డ‌దు. 13 సెప్టెంబ‌ర్ నుంచి నాన్ స్టాప్ ఫోలు అంటూ క్యాప్ష‌న్ క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. చివ‌ర‌లో బాల‌కృష్ణ క‌టౌట్ ముందు నోట్లో సిగ‌రెట్‌, చేతిలో సినిమా టికెట్ల‌తో హీరో శివ రామ‌చంద్ర‌వ‌ర‌పు క‌నిపిస్తోన్నాడు.

ప్ర‌మోష‌న్స్ షురూ…

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తోను బాలుగాని టాకీస్ మూవీ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఈ మూవీలో ర‌ఘు కుంచే, సుధాక‌ర్‌రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.బాలుగాని టాకీస్ మూవీకి విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీనిధి సాగ‌ర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ ఈ మూవీకి స్మ‌ర‌ణ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అశ్విత్ గౌత‌మ్ స్క్రీన్‌ప్లే అందిస్తోండ‌గా ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స‌మ‌కూర్చుతున్నాడు.

నెగెటివ్‌…పాజిటివ్‌…

శివ రామ‌చంద్ర‌వ‌ర‌పు హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇదివ‌ర‌కు తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌, నితిన్ భీష్మ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌, మిజిలీ, హిట్ 2 తో పాటు ఇరవైకిపైగా సినిమాల్లో పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌ల్లో క‌నిపించాడు. కొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు. న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న స‌హా మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా న‌టించాడు శివ రామ‌చంద్ర‌వ‌ర‌పు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024