OTT Survival Thriller Movie: ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024


OTT Survival Thriller Movie: ఓటీటీలోకి మరో మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. అప్పుడెప్పుడో ఈ ఏడాది జనవరి 19న థియేటర్లలో రిలీజైన మాయావనం ఈ మూవీ.. ఏడు నెలల తర్వాత రావడం ఓ విశేషమైతే.. ఇప్పుడు కూడా రెంటల్ విధానంలోనే ఈ సినిమా చూసే అవకాశం ఉంది. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

మాయావనం ఓటీటీ స్ట్రీమింగ్

ఓటీటీలోకి తాజాగా వచ్చిన మలయాళం మూవీ మాయావనం. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా చూడాలంటే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం మలయాళం ఆడియోలోనే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసే అలవాటు ఉంటే.. ఈ సస్పెన్స్ మూవీని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు.

ఈ మాయావనం మూవీ జనవరి 19న థియేటర్లలో రిలీజైంది. అయితే అక్కడ ఈ సినిమాకు అంత రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ ఈ సినిమాకు దారుణమైన 2.2 రేటింగ్ మాత్రమే ఉంది. అలాంటి సినిమాను ఇన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చి.. ఇప్పుడు కూడా రూ.99 రెంట్ విధానంలో అందుబాటులోకి తేవడం అంతు చిక్కనిదే.

మాయావనం మూవీ ఏంటంటే?

మాయావనం ఓ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను జయత్‌లాల్ చంద్రశేఖరన్ డైరెక్ట్ చేశాడు. ఆదిత్య సాయి, జాఫర్ ఇడుక్కి, సెంథిల్ కృష్ణలాంటి వాళ్లు నటించారు. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ ఓ అడవిలోకి వెళ్లి అనుకోకుండా పలు సమస్యల్లో చిక్కుకుంటారు. అక్కడి నుంచి వాళ్లు ప్రాణాలతో బయటపడటానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమాలో చూపించారు.

ఓటీటీల్లోని లేటెస్ట్ మలయాళం సినిమాలు

ఓటీటీల్లోకి ఈ మధ్యే పలు మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ప్రైమ్ వీడియోలోనే గోలం అనే థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ఇదే ఓటీటీలో ఈ మధ్యే లిటిల్ హార్ట్స్ అనే రొమాంటిక్ కామెడీ మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక సోనీలివ్ ఓటీటీలో తలవన్ అనే మూవీ కూడా వచ్చింది. జీ5 ఓటీటీలో ఈ మధ్యే మనోరతంగళ్ అనే ఆంథాలజీ రిలీజైంది. 9 మంది సూపర్ స్టార్లు ఈ సిరీస్ లో నటించడం విశేషం. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్ లాంటి వాళ్లు ఉన్నారు. ఇక ఆగస్ట్ 20 నుంచి గుర్.. అనే కామెడీ మూవీ కూడా రాబోతోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024