Best Web Hosting Provider In India 2024
పండగ వచ్చిందంటే ఇంట్లో స్వీట్లు ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ చేసేవే కాకుండా కాస్త ప్రత్యేకంగా ఇలా బాదాం, కొబ్బరి కలిపి బర్ఫీ చేసేయండి. ఇది చూడ్డానికి, రుచిలో కూడా అచ్చం బయట నుంచి తెచ్చినట్లే ఉంటుంది. తక్కువ సమయంలోనే రెడీ అవుతుంది.
బాదం కొబ్బరి బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు:
250 గ్రాములు బాదం
2 తాజా కొబ్బరి పెద్ద ముక్కలు
ఒక గ్లాసు పాలు
400 గ్రాముల పంచదార
పావు కప్పు దేశీ నెయ్యి
యాలకుల పొడి ఒక టీస్పూన్
బాదం, కొబ్బరి బర్ఫీ తయారీ విధానం:
- ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బాదాం కూడా వేరుగా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. రెంటింటినీ వేరు వేరు గిన్నెలో వేసి పెట్టుకోండి.
- పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి.
- మరొక ప్యాన్ తీసుకుని అందులో చక్కెర, నీళ్లు, యాలకుల పొడి కలిపి పంచదార పాకం రెడీ చేయాలి. దీనికోసం ఈ మిశ్రమాన్ని తీగపాకం వచ్చేదాకా వేడి చేసుకుంటే సరిపోతుంది.
- కడాయిలో నెయ్యి వేసి వేడెక్కాక అందులో బాదాం పొడి వేయాలి. మీకిష్టం ఉంటే దీంతో పాటే అన్ సాల్టెడ్ పిస్తా పొడి, జీడిపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు.
- ఒక రెండు నిమిషాలు ఈ పొడిని నెయ్యిలో వేయించాక కొబ్బరి ముద్ద కూడా వేసుకోవాలి.
- తక్కువ మంట మీద మరో రెండు నిమిషాలు అన్నీ కలిసేలా వేయించాలి.
- అందులోనే వేడి చేసిన పాలు కూడా పోసుకోవాలి.
- పాలు చిక్కబడి పూర్తిగా ఇంకిపోయే వరకు కలుపుతూనే ఉండాలి.
- ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకం పోసుకుని కలుపుకోవాలి. ఇది గట్టిగా అయ్యాక ఒక స్టవ్ కట్టేయాలి.
- ఒక ట్రేకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వీటిని చతురస్రం లేదా డైమండ్ ఆకారంలో కట్ చేశారంటే బాదాం కొబ్బరి బర్ఫీ రెడీ.