Best Web Hosting Provider In India 2024
Telugu Suspance Thriller OTT: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలుసు కదా. అందులో మిస్టరీ థ్రిల్లర్ మూవీ నింద ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు అతడు నటించిన మరో మూవీ విరాజి కూడా ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వస్తోంది.
విరాజి ఓటీటీ రిలీజ్ డేట్
వరుణ్ సందేశ్ మూవీ విరాజి ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోమవారం (ఆగస్ట్ 19) సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
“చుట్టూ పిచ్చి ప్రపంచం. బయటపడతాడా, భయపెడతాడా? విరాజి ఆగస్ట్ 22న మీ ఆహాలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో విరాజి ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా వీడియో అనౌన్స్ చేసింది. ఆద్యంత్ హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ విరాజి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు.
విరాజి మూవీ గురించి..
వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా నటించిన మూవీ విరాజి. ఆగస్ట్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. కొందరు వ్యక్తులను ఓ కొండపై ఉన్న మెంటల్ హాస్పిటల్ కు రమ్మంటాడు.
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి తమను మోసం చేశాడని వాళ్లు తెలుసుకుంటారు. ఆ హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత వాళ్లలో ఒక్కొక్కరినీ చంపుతూ వెళ్తాడు. అసలు అతడు ఎవరు? ఎందుకలా చేస్తాడు? అతని బారి నుంచి వాళ్లు ఎలా తప్పించుకుంటారు అన్నది ఈ విరాజి స్టోరీ.
అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా తీయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. దీంతో ఈ విరాజి మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. స్క్రీన్‌ప్లేలో గందరగోళం ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినా కూడా దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మాత్రం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. వరుణ్ సందేశ్ నటించిన మరో మూవీ నింద ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ విరాజి గురువారం (ఆగస్ట్ 22) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits