Pawan Kalyan OG: ఓజీ నుంచి పవన్ బర్త్‌డే నాడు బిగ్ సర్‌ప్రైజ్.. రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత డీవీవీ

Best Web Hosting Provider In India 2024


Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG) మూవీ గురించి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశిస్తున్న అప్డేట్స్ ఇచ్చాడు నిర్మాత డీవీవీ దానయ్య. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ఈవెంట్ సందర్భంగా దానయ్య.. ఓజీ మూవీ గురించి చెప్పడం విశేషం.

పవన్ బర్త్‌డేనాడు ఓజీ టీజర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ టీజర్ ఎప్పుడు? షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం కానుంది? అసలు మూవీ రిలీజ్ ఎప్పుడు? ఈ మూడు ప్రశ్నలకు ఒకే ఈవెంట్లో నిర్మాత డీవీవీ దానయ్య సమాధానం ఇచ్చాడు. పవన్ కల్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2న వస్తోంది కదా.. మరి ఆ రోజున ఓజీ టీజర్ ఏమైనా ఉంటుందా అని సరిపోదా శనివారం మూవీ ఈవెంట్లో మీడియా అతన్ని ప్రశ్నించింది.

దీనికి దానయ్య స్పందిస్తూ.. ఉంటుంది అని ఒక్క ముక్కలో చెప్పేశాడు. ఇక అంతకుముందు హీరో నానియే ఓజీ అప్డేట్ ఏంటని డీవీవీని అడిగాడు. ఈవెంట్ జరుగుతండగానే, మీడియా ప్రశ్నలకు ఇంకా సమయం కాకుండానే ఎవరు అడిగారా అని యాంకర్ ఆశ్చర్యపోతుండగా.. తానే అడిగినట్లు నాని చెప్పాడు.

నాని అడిగిన ప్రశ్నకు డీవీవీ స్పందిస్తూ.. “ఓజీ తొందర్లో, అతి తొందర్లో మీ ముందుకు వస్తోంది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం” అని చెప్పాడు. ఈ వీడియోను డీవీవీ ఎంటర్టైన్మెంట్ కూడా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం విశేషం. “ఓజీ షూట్ సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ కాబోతోంది’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేసింది.

ట్రైలర్ లాంచ్‌లోనూ..

నిజానికి గత వారం సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ ఓజీ మూవీ గురించి ఫ్యాన్స్ అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో ప్రేక్షకులు ఒక్కసారిగా ‘ఓజీ.. ఓజీ’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో థియేటర్ మొత్తం ఓజీ మోతతో హోరెత్తింది.

ఓజీ మూవీని కూడా డీవీవీ దానయ్యే నిర్మిస్తున్నారు. దీంతో ఆ చిత్రం గురించి చెప్పాలంటూ ప్రేక్షకులు అలా అరిచారు. ప్రేక్షకులు ఓజీ అంటూ అరవడంతో నాని, ఎస్‍జే సూర్య కూడా ఒక్కసారిగా నవ్వారు. ఓజీ అంటూ జనాలు హోరెత్తించటంతో దానయ్య దీనిపై స్పందించారు. “ఓకే.. వస్తుంది.. వస్తుంది” అని చెప్పారు.

డిప్యూటీ సీఎం హోదాలో..

బ్రో మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన మరో మూవీ రిలీజ్ కాలేదు. ఈ ఓజీతోపాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ చేస్తున్నాడు. అయితే మధ్యలో ఏపీ ఎన్నికలు రావడం, జనసేన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నిలిచి మొదట ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. తర్వాత ఏపీకి డీప్యూటీ సీఎం అయ్యాడు.

దీంతో కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెట్టాడు. అయితే తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో ఓజీ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నట్లు తాజాగా డీవీవీ దానయ్య ఇచ్చిన అప్డేట్ తో స్పష్టమవుతోంది. ఆ మధ్య ఓ బహిరంగ సభలోనూ పవన్ ఈ ఓజీ మూవీ గురించి మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సినిమా వస్తుంది.. అందరూ చూడండి బాగుంటుంది అని అనడం గమనార్హం.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024