Best Web Hosting Provider In India 2024
Shakhahaari OTT Release In Telugu: ఈ మధ్య కాలంలో మలయాళంతో పాటు తమిళ, కన్నడ సినిమాలు కూడా కంటెంట్‌పైన ఫోకస్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నాయి. కన్నడలో ఇప్పటివరకు ఎక్కువగా కేజీఎఫ్ వంటి కమర్షియల్ చిత్రాలే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాయి. ఆ తర్వాత కాంతార, 777 చార్లీ వంటి కాన్సెప్ట్ సినిమాలు సైతం కోట్లల్లో కలెక్షన్స్ సాధించాయి.
5 రెట్ల ప్రాఫిట్
అలా ఈ సంవత్సరం అంటే 2024లో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మర్డర్ మిస్టరీ మూవీ శాఖాహారి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది ఈ సినిమా. కేవలం రూ. కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ అయి ప్రొడ్యూసర్స్‌కు ఐదింతల ప్రాఫిట్ రాబట్టింది.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరెక్కిన శాఖాహారి మూవీకి సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కన్నడ సీనియర్ అండ్ పాపులర్ యాక్టర్ రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతోపాటు గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్ యూజే, నిధి హెగ్డే ఇతర కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇదివరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే 24 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అప్పుడు ఇది కేవలం కన్నడ భాషలో మాత్రమే డిజిటల్ ప్రీమియర్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు శాఖాహారి సినిమాను తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం శాఖాహారి కన్నడ భాషతోపాటు తెలుగు సబ్‌టైటిల్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పుడు ఆహా ఓటీటీలో
అయితే, ఇప్పుడు మరో ఓటీటీలోకి రానుంది శాఖాహారి మూవీ. ఈసారి సబ్‌టైటిల్స్ కాకుండా తెలుగు భాషలోనే ఓటీటీ రిలీజ్ కానుంది శాఖహారి మూవీ. కేవలం తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులు అందించే ప్లాట్‌పామ్స్‌లో ఒకటైన ఆహా ఓటీటీలోకి శాఖాహారి సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (ఆగస్ట్ 21) ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
7.7 ఐఎమ్‌డీబీ రేటింగ్
ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ అందుకున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ శాఖాహారి మూవీ ఆహా ఓటీటీలో ఆగస్ట్ 24 నుంచి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. “క్రైమ్, ఎమోషన్స్, అలాగే ఊహించని ట్విస్టులతో సాగే శాఖాహారి మూవీ ఆగస్ట్ 24 నుంచి ఆహాలో ప్రసారం కానుంది” అని ఆహా టీమ్ ట్వీట్ చేసింది.
ఇంకో మూడు రోజుల్లో ఓటీటీ రిలీజ్
కాబట్టి, మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను తెలుగులో అనుభూతి చెందలేక పోయామే అని ఫీల్ అయ్యేవారికి ఈ న్యూస్ స్పెషల్ సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇంకో మూడు రోజుల్లో శాఖాహారి తెలుగు వెర్షన్ ఆహాలో ఓటీటీ రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ కన్నడ నాట థియేటర్లలో సుమారు 50 రోజులపాటు ఆడింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits