Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయం, దేవినేని అవినాష్ కు నోటీసులు

Best Web Hosting Provider In India 2024


Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఈ నేపథ్యంలో దాడి జరిగిన రోజు అంటే అక్టోబర్ 19, 2021 నాడు వైసీపీ ఆఫీసు వద్ద సీసీ కెమెరాల వీడియోలు సమర్పించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వారం క్రితమే పోలీసులు నోటీసులు ఇవ్వగా…ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఆ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. విజయవాడ, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ దాడిలో పాల్గొన్న వైసీపీ నేతల ఆధారాలు సేకరించారు. ఆగస్టు 16న పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపింది. అయితే ఈ విషయంగా ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎవరు ఉన్నారు? ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ ఈ ఫుటేజీ వివరాలు అందిస్తుందా? లేదా? ఆసక్తిగా మారింది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్, దేవినేని అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే వీరు హైకోర్టుకు ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsYsrcpTdpTrending ApAp PoliceAp Politics

Source / Credits

Best Web Hosting Provider In India 2024