Best Web Hosting Provider In India 2024
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ప్రతిపక్ష నేతగా నియమించాలని పార్టీ అధ్యక్షుడికి నేనే సూచించాను
నా అభ్యర్థనను వైయస్ జగన్ మన్నించారు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం
పార్టీలో నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను
నన్ను గుర్తించి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది
మీడియా సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి
ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సకు శుభాకాంక్షలు
పార్టీ నాయకత్వంమీద విశ్వాసంతో కార్యకర్తలు సాధించిన గొప్ప గెలుపు ఇది: లేళ్ల అప్పిరెడ్డి
తాడేపల్లి : విశాఖ జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్షనేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. బొత్సను ప్రతిపక్ష నేతగా నియమించడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు అభినందలు తెలియజేశారు.
విశాఖజిల్లాలో జరిగిన స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్ధానిక సంస్ధల సభ్యులందరూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు నాయకత్వం మీద విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్స సత్యనారాయణను గెలిపించారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్ధులను కూడా పెట్టలేకపోయిందన్నారు.
ప్రస్తుతం పార్టీ కార్యాలయ భాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను… రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో… శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షులు వైయస్ జగన్ ముందు తానే ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ… సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామన్నారు. ఈ నేపధ్యంలో తమ అభ్యర్ధనను పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మన్నించారని అప్పిరెడ్డి తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటూ.. .క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల్లాగే పని చేశాన్నారు. తాను గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వలనే నియమితుడయ్యానన్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా అయన వలనే వచ్చిందన్నారు. అలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయని.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని ఆయన స్పష్టం చేశారు.