Best Web Hosting Provider In India 2024
Kolkata rape-murder case: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భావిస్తోంది. విచారణలో ఆయన ఇచ్చిన కొన్ని సమాధానాల్లో వ్యత్యాసాలు కనిపించడంతో లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఈ నెల ప్రారంభంలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆసుపత్రి సెమినార్ గదిలోనే అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. 36 గంటల కఠినమైన షిఫ్ట్ మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఆమె సెమనార్ హాల్ లోనికి వెళ్లిన సమయంలో ఈ హత్యాచారం చోటు చేసుకుంది. ఈ దారుణ హత్యకు పాల్పడిన సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ ను కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు.
ప్రిన్సిపాల్ పై అనుమానాలు
నేరం జరిగిన రెండు రోజుల తర్వాత రాజీనామా చేసిన మెడకల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ చాలా రోజులుగా విచారిస్తోంది. ట్రైనీ డాక్టర్ హత్య గురించి తెలియగానే మీరు ఏం చేశారని ఘోష్ ను సీబీఐ ప్రశ్నించింది. హత్య గురించి సమాచారం రాగానే, డాక్టర్ సందీప్ ఘోష్ ముందుగా ఎవరిని సంప్రదించాడనే విషయాన్ని కూడా ఆరా తీసింది. మృతదేహాన్ని అప్పగించే ముందు బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటల పాటు ఎందుకు నిరీక్షించారని డాక్టర్ ను ప్రశ్నించింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్ పక్కనే ఉన్న గదుల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడంపై కూడా ఆయనను ప్రశ్నించారు.
లై డిటెక్టర్ టెస్ట్
సందీప్ ఘోష్ ను పలు దఫాలుగా దాదాపు 60 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. ఆయన సమాధానాల్లో తేడాలున్నాయని గుర్తించిన సీబీఐ, ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని భావిస్తోంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ ఇటీవల స్థానిక కోర్టు నుంచి అనుమతి పొందింది.
Best Web Hosting Provider In India 2024
Source link