Best Web Hosting Provider In India 2024
Bangalore Days Review: రానా, ఆర్య, సమంత, పార్వతి, శ్రీదివ్య, బాబీసింహా ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ బెంగళూరు డేస్ డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. మలయాళ మూవీ బెంగళూరుడేస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.
2016లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ అనివార్య కారణాల వల్ల ఎనిమిదేళ్ల తర్వాత థియేటర్లను స్కిప్ చేస్తూ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
శివ, దివ్య లవ్‌స్టోరీ…
దివ్య (శ్రీదివ్య), అర్జున్ (ఆర్య), కన్నా(బాబీ సింహా)…ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసిపెరుగుతారు. దివ్య డిగ్రీలో టాపర్. ఎమ్‌బీఏ పూర్తిచేసి సొంతంగా ఓ కంపెనీ పెట్టుకోవాలని కలలుకుంటుంది. కానీ తల్లిదండ్రులకు ఉన్న జాతకాల పిచ్చి కారణంగా డిగ్రీతోనే దివ్య కలలకు పుల్‌స్టాప్ పడుతుంది. శివ (రానా దగ్గుబాటి) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకొని భర్తతో కలిసి బెంగళూరు షిఫ్ట్ అవుతుంది. శివ ఎప్పుడూ ఉద్యోగబాధ్యతలతో బిజీగా ఉంటాడు.
దివ్యను అసలుపట్టించుకోడు. తనకంటే ముందు శివ జీవితంలో గ్రేస్ దేవపుష్ప (సమంత) అనే అమ్మాయి ఉందనే నిజం దివ్యకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? గ్రేస్‌ను ప్రాణంగా ప్రేమించిన శివ ఆమెకు ఎలా దూరమయ్యాడు? భార్య మంచితనాన్ని, ప్రేమను శివ అర్థం చేసుకున్నాడా?
అర్జున్ కథ….
అర్జున్ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటారు. అర్జున్ బాగోగులను పట్టించుకోరు. దాంతో చదువు మధ్యలోనే ఆపేసిన అర్జున్ రేసర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. తల్లిదండ్రులపై ఉన్న ద్వేషం… కోపంగా మారడంతో కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోయాడు. అదే అతడి లక్ష్యానికి అడ్డుగా మారుతుంది.
సారా అనే రేడియో జాకీ చేసే షో వింటూ ఆమెతో ప్రేమలో పడతాడు. సారాకు రెండుకాళ్లు పనిచేయవు. తన అవిటితనాన్ని జయిస్తూ ఉన్నతచదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటుంది. సారా కూడా అర్జున్‌ను ఇష్టపడుతుంది. కానీ సారా తల్లి వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. తన ప్రేమను సారాకు అర్జున్ చెప్పాడా…రేసర్ అయ్యాడా…
కన్నా పెళ్లి కహానీ…
కన్నా తండ్రితో కలిసి వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. ఊరిలోనే సెటిల్ కావాలని కోరుకుంటాడు. కానీ తల్లి మాత్రం పట్టుపట్టి అతడిని చదివిస్తుంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో కన్నా జాయిన్ అవుతాడు. కన్నా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతులను గౌరవించే అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు.
లక్ష్మి (రాయ్ లక్ష్మి) అనే ఎయిర్ హోస్టెస్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం అతడిని మోసం చేసి వెళ్లిపోతుంది. చివరకు ఓ ఫారిన్ అమ్మాయిని శివ ఎందుకు పెళ్లిచేసుకున్నాడు…తమ జీవితంలో ఎదురైన కష్టాలను ఈ ముగ్గురు స్నేహితులు ఎలా అధిగమించారు అన్నదే బెంగళూరు డేస్ మూవీ కథ.
ఎనిమిది కోట్ల బడ్జెట్…యాభై కోట్ల కలెక్షన్స్…
బెంగళూరు డేస్ మలయాళంలో కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైంది. ఫస్ట్ వీక్ ఈ సినిమాను ఎవరూ చూడలేదు. మౌత్‌టాక్‌తో మెళ్లగా వసూళ్లు పెరిగి చివరకు కల్ల్ క్లాసిక్ బ్టాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
రియలిస్టిక్ అప్రోచ్…
బెంగళూరు డేస్‌లో పెద్దగా కథంటూ ఏమీ ఉండదు. ఓ ముగ్గురు స్నేహితులు.. ప్రేమ విషయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు…వారి బాండింగ్…కలలకు వాస్తవాలకు మధ్య వారు ఎదుర్కొనే స్ట్రగుల్స్‌ను మెడ్రన్ స్టైల్‌లో రియలిస్టిక్ అప్రోచ్‌తో మలయాళ దర్శకురాలు బెంగళూరు డేస్ సినిమాలో చూపించారు. హీరోహీరోయిన్ల పాత్రల్లో ఆడియెన్స్ తమను తాము చూసుకునేలా చేయడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యింది. ఆ నాచురాలిటీ మాత్రం తెలుగు వెర్షన్‌లో మిస్సయింది.
మక్కీకి మక్కీ…
మలయాళ ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ కాపీ కొట్టేయడంతో సినిమాలో ఎమోషన్ కనెక్టివిటీ కనిపించదు. ఏదో మిస్సయిన వెలితి సినిమా చివరి సీన్ వరకు కనిపిస్తూనే ఉంటుంది. ప్రధాన పాత్రధారుల యాక్టింగ్, వారికి ఎదురయ్యే స్ట్రగుల్స్ అన్నీ ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తాయి. పాత్రకు తగ్గ నటుడిని ఎంపికచేసుకోవడం చాలా ముఖ్యం. అదే సినిమాకు మైనస్ అయ్యింది. అన్ని క్యారెక్టర్స్ మిస్ ఫిట్‌లా అనిపిస్తాయి.
సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్…
కన్నా…క్యారెక్టర్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అతడి వాయిస్ ఓవర్‌తో దివ్య…అర్జున్ పాత్రలను ఫన్నీగా పరిచయం చేశారు దర్శకుడు. దివ్య పెళ్లితో…కన్నా జాబ్…వారిద్దరి కోసం అర్జున్ బెంగళూరు రావడంతో కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో అవరోధం…చివరకు వాటిని ఎలా దాటరన్నది చిన్న చిన్న సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు చూపించాడు. మధ్యలో రానా, సమంత ఫ్లాష్‌బ్యాక్ సీన్ ఆసక్తిని పంచుతుంది.
సమంత…పార్వతి…
బెంగళూరు డేస్‌లో చాలా మంది హీరోహీరోయిన్లు ఉన్నారు. యాక్టింగ్, లెంగ్త్ పరంగా అందరికి సమంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అర్జున్‌గా… జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేని దూకుడైన కుర్రాడిగా అర్య ఎక్కువగా హైలైట్ అయ్యాడు. అమ్ము పాత్రకు శ్రీదివ్య న్యాయం చేసింది. అంతమందిలో షైన్ అయ్యింది. అల్లరితనం, అమాయకత్వం కలగలసిన పాత్రలో ఆమె నటన బాగుంది.
తల్లి చాటు బిడ్డగా బాబీసింహా సెటిల్డ్ యాక్టింగ్ కనబరిచాడు. అతడి కామెడీ ట్రాక్‌లో అక్కడక్కడ నవ్వించాయి. పార్వతి తిరువోతు చిన్న పాత్రే అయినా మెప్పిస్తుంది. సమంత పది నిమిషాలోపే పాత్రే కానీ ఉన్నంతలో అదరగొట్టింది. రానా సినిమా మొత్తం సీరియస్ లుక్‌లో కనిపించడా. అంతగా అతడికి ఈ పాత్ర నప్పనట్లుగా అనిపిస్తుంది.
మలయాళం చూడని వారికి…
బెంగళూరు డేస్ మలయాళ ఒరిజినల్‌లోని సోల్, ఎమోషన్స్ తెలుగులో మిస్సయిన అనుభూతి కలుగుతుంది. మలయాళ సినిమా చూడని వారిని మాత్రం ఈ తెలుగు మూవీ మెప్పిస్తుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits