Best Web Hosting Provider In India 2024
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు ఆగష్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877-2264429 నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా టీటీడీ వెబ్‌సైట్( www.tirumala.org) లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
రాగి రేకుల టెండర్ కమ్ వేలం:
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులను కూడా వేలం వేయనుంది. ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్ కమ్ వేలం (ఆఫ్‌లైన్) వేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) 15 లాట్లు ఆగష్టు 30న వేలం వేస్తారు. సిల్వర్ కోటెడ్ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877-2264429 ను సంప్రదించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
టాపిక్