Minister Ponguleti Challenge: హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నా! నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి – మంత్రి పొంగులేటి

Best Web Hosting Provider In India 2024


హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ తో పాటు హరీశ్ రావు వచ్చి తన ఇంటిని పరిశీలించుకోవచ్చని… టేప్ పెట్టి కొలిచి వివరాలను తెలుసుకోవచ్చని సవాల్ విసిరారు.

“కేటీఆర్, హరీష్ రావులకు ఓపెన్ చాలెంజ్ విసురుతున్నాను. మీరు ఇద్దరు మంత్రులుగా పని చేశారు కదా.. దమ్ముంటే నా ఇల్లు అక్రమ కట్టడమని నిరూపించండి. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ను కూడా ఆదేశిస్తున్నా! నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి. బీఆర్ఎస్ నేతలను కూడా వెంట తీసుకెళ్లండి. కొత్త టేపులు తీసుకెళ్లి కొలతలు తీయండి. ఏ చిన్న నిర్మాణం కూడా అక్రమ కట్టడం అని తేలితే వెంటనే కూల్చేయండి. ఇదే పొంగులేటి సవాల్” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

టాపిక్

Ponguleti Srinivas ReddyTelangana NewsKtrHarish Rao

Source / Credits

Best Web Hosting Provider In India 2024