Dried Ginger: అల్లం బదులు శొంఠి వాడండి, ఎండిన అల్లం ఇలా వాడారంటే గుండెకు, ఒంటికి లాభాలెన్నో

Best Web Hosting Provider In India 2024


శొంఠి అంటే ఎండిన అల్లం. తాజా అల్లంతో పోలిస్తే శొంఠితో అనేక లాభాలుంటాయి. దీన్ని రోజూ వాడటానికి అల్లం చాయ్ తాగే అలవాటున్నవాళ్లు బదులుగా శొంఠి వేసుకుని టీ తాగితే మరిన్ని లాభాలు పొందొచ్చు. చాయ్ చేసేటప్పుడు పాలు, పంచదార, టీ పొడి వేశాక ఈ శొంఠిని కాస్త దంచి వేసి ఉడికించి వడకట్టుకుంటే శొంఠి టీ రెడీ అవుతుంది. శొంఠి టీతో పాటే దాన్ని వంటల్లో వాడినా అనేక లాభాలుంటాయి.

శొంఠిని ఇలా వాడొచ్చు

ఇదివరకు శొంఠి పెద్ద ముక్కలుగానే దొరకేది. ఇంట్లోనే దాన్ని దంచి పొడి చేసేవాళ్లు. ఇప్పుడు నేరుగా శొంఠి పొడి దొరుకుతోంది. డ్రైడ్ జింజర్ పౌడర్ అంటే ఎక్కడైనా దొరికేస్తుంది. దాంతో దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం, వాడటం సులవయ్యింది. ఈ పొడిలో ఉప్పు, లవంగాల పొడి కలిపి తీసుకోవచ్చు. లేదా టీ చేసి తాగొచ్చు. జలుబు లక్షణాలుంటే రోజుకు రెండు సార్లు అరచెంచా ఈ పొడిని తీసుకుంటే తగ్గిపోతుంది.

ఈ ఎండిన అల్లాన్ని టీలో వేసుకోవడంతో పాటే, కూరల్లోనూ వాడొచ్చు. శొంఠికి ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఏళ్ల కిందటినుంచే దీన్ని వాడుతున్నారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలే దానికి కారణం.

శొంఠి లాభాలు:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారం దీని మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అల్లం ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అల్లం సారం వాడటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడానికి వేసుకునే మందుల్లాంటి ప్రభావం కాస్త ఉంటుందని చెబుతున్నారు.

నెలసరిలో నొప్పి

నెలసరిలో చాలా మందికి పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. దానికోసం చాలా రకాల చిట్కాలే ప్రయత్నిస్తుంటారు. ఈసారి శొంఠితో చేసిన టీ కాస్త తాగి చూడండి. ఉపశమనం ఉంటుంది. కూరల్లో దీన్ని కాస్త వేసుకున్నా మంచిదే.

డయాబెటిస్

రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రణలో ఉండే గుణం శొంఠికి, అల్లానికి ఉంది. రోజుకు రెండు గ్రాముల శొంఠిపొడిని తీసుకుంటే 12 శాతం దాకా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు దీన్ని ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.

మార్నింగ్ సిక్‌నెస్:

ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వాంతులు, తల తిప్పడం లాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు శొంఠి లేదా అల్లం టీ తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.

బరువు తగ్గించడంలో:

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే శొంఠిని ఆహారంలో చేర్చుకోండి. ఇది కేలరీలు తొందరగా కరిగేలా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఇన్ఫెక్షన్లు

అల్లంను జింజర్ అంటాం. దీంట్లో జింజరాల్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

అజీర్తి

తిన్న వెంటనే కడుపులో పైభాగంలో నొప్పి రావడం అజీర్తికి కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు కాస్త శొంఠిపొడి చక్కెరలో కలిపి నేరుగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. లేదా టీ తాగినా మంచిదే. కూరల్లోనూ ఎక్కువగా వాడితే తొందరగా జీర్ణం అవుతుంది.

వీళ్లు వాడొద్దు

దాదాపు ప్రతి ఒక్కరు శొంఠిని తీసుకోవచ్చు. చాలా కొద్ది మందిలో దీనివల్ల గుండెలో మంట, డయేరియా, కడుపులో వికారం లాంటి సమస్యలొస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వాడటం ఆపేయడం ఉత్తమం.

 

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024