Gang Rape on Minor: మైనర్ బాలికపై సామూహిక‌ అత్యాచారం..! గర్భం దాల్చటంతో బయటపడిన అసలు విషయం

Best Web Hosting Provider In India 2024


శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఘోర ఘ‌ట‌న జరిగింది. మైన‌ర్ బాలిక‌పై న‌లుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆమెను గ‌ర్భ‌వ‌తి చేసి పారార‌య్యారు. అయితే ఆ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

శ్రీ‌కాళ‌హస్తి బ‌హ‌దూర్ పేట‌కు చెందిన మైన‌ర్ బాలిక చిన్న‌త‌నంలోనే త‌న త‌ల్లిదండ్రుల‌ను కోల్పోవ‌డంతో అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటూ చ‌దువుకుంటోంది. అయితే న‌లుగురు యువ‌కులు బాలిక వెంట‌ప‌డేవారు. అలా వెంట‌ప‌డుతూ మాయ‌మాట‌లు చెప్పి ఆ బాలిక‌ను లోబ‌రుచుకున్నారు. ఈ క్ర‌మంలో ఆమెపై న‌లుగురు క‌లిపి పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. 

త‌ల్లిదండ్రులు లేని ఆ చిన్నారి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విష‌యం ఎవ‌రికి చెప్పినా చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో ఆ చిన్నారి త‌న‌లోనే ఉంచుకుంది.  అయితే ఇటీవ‌లి ఆ బాలిక‌ను అత్యాచారం చేసిన విష‌యంలో వెలుగులోకి రావ‌డంతో గ్రామ పెద్ద‌లు రంగంలోకి దిగారు. ఏదో చిన్న త‌ప్పు చేసిన‌ట్లు ఆ యువ‌కుల‌ను మంద‌లించి వ‌దిలేశారు. ఆ మంద‌లింపుతోనే గ్రామ పెద్ద‌లు రాజీ చేసేశారు.

అయితే గ్రామ పెద్ద‌ల‌ను ఎదిరించి ముందుకెళ్లే స్థోమ‌త ఆ బాలిక‌కు లేక‌పోవ‌డంతో బాధ‌ప‌డుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే సదరు బాలిక గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం బాలిక అమ్మ‌మ్మ‌కు తెలిసింది. ఇక ఆమె ఊరుకోలేదు. ఏం జ‌రిగితే అదే జ‌రిగింద‌నుకుని .. గురువారం రాత్రి శ్రీ‌కాళ‌హ‌స్తి రెండో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.  నిందితులపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదమైంది.

బాలిక అమ్మ‌మ్మ ఫిర్యాదుతో శ్రీ‌కాళ‌హ‌స్తి రెండో ప‌ట్ట‌ణ పోలీసులు నిందితులు మ‌ధు, సునీల్‌, చంద్ర‌తో పాటు తిరుప‌తికి చెందిన మ‌రో యువ‌కుడిపై కేసు న‌మోదు చేశారు. వెంట‌నే ద‌ర్యాప్తు ప్రారంభించారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం శుక్ర‌వారం శ్రీ‌కాళ‌హ‌స్తి ప్రాంతీయ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ నుంచి తిరుప‌తి రుయాకు త‌ర‌లించారు. నిందితుల‌ను అదుపులోకి పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

రిపోర్టింగ్ – జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

టాపిక్

Andhra Pradesh NewsCrime Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024