CISF Recruitment 2024: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: 1130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Best Web Hosting Provider In India 2024


సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1130 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆగస్ట్ 31 నుంచి రిజిస్ట్రేషన్

సీఐఎస్ఎఫ్ (CISF) లో కానిస్టేబుల్ పోస్ట్ ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 30, 2024న ముగుస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి సైన్స్ సబ్జెక్టుతో 12 వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అయిన సెప్టెంబర్ 30 వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 01/10/2001 నుంచి 30/09/2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పీఈటీ/పీఎస్టీలో అర్హత సాధించిన అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. పీఈటీ/పీఎస్టీ/డీవీలో అర్హత సాధించిన అభ్యర్థులను ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో రాతపరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలతో కూడిన ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ తరహాలో ఉంటాయి. రాత పరీక్షను ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో మాత్రమే ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ (ESM) అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, యుపీఐ (UPI) ఉపయోగించి లేదా ఎస్బీఐ చలానా జనరేట్ చేయడం ద్వారా ఎస్బీఐ శాఖలలో నగదు ద్వారా ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. పైన పేర్కొన్న విధంగా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా చెల్లించిన రుసుమును ఆమోదించరు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ cisfrectt.cisf.gov.in ను చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024



Source link