Best Web Hosting Provider In India 2024
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ – 2024 షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు శనివారం అధికారులను వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబరు 1 ప్రారంభమై… 17వ తేదీతో ముగియనుంది. ఇక సెప్టెంబర్ 20వ తేదీతో సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైన… 28వ తేదీతో ముగుస్తుంది. ఆగస్టు 27వ తేదీన పూర్తిస్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను వెబ్ సైట్ ( https://icet.tsche.ac.in/ ) లో ఉంచనున్నారు.
ముఖ్య తేదీలు:
ప్రవేశ పరీక్ష – టీజీ ఐసెట్ – 2024
కౌన్సెలింగ్ ప్రారంభం – సెప్టెంబర్ 1, 2024
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు – సెప్టెంబర్ 1 నుంచి 8వరకు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 9వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.
సెప్టెంబర్ 4 నుంచి 11వరకు వెబ్ఆప్షన్లను ఎంచుకోవాలి.
సెప్టెంబర్ 14వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ – https://icet.tsche.ac.in/
ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.
ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసీఏ 64 కాలేజీల్లో 6990 సీట్లు ఉన్నాయి. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
TG ICET Resullts 2024 Check : తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహించింది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి. కౌన్సెలింగ్ లో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
టాపిక్