Horror Comedy OTT: సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Best Web Hosting Provider In India 2024


ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్య సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని సుమారు రూ.130కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఈ ముంజ్య మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అనూహ్యంగా ఓటీటీ కంటే ముందే టీవీలో ఈ చిత్రం వచ్చింది. అయితే, ఇప్పుడు సడెన్‍గా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

స్ట్రీమింగ్ వివరాలు

ముంజ్య సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‍లో నేడు (ఆగస్టు 25) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. హిందీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‍గా ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ తీసుకొచ్చింది.

థియేటర్లలో రిలీజైన సుమారు 11 వారాల తర్వాత ముంజ్య చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చింది. గత వారమే ఈ సినిమా స్టార్ గోల్డ్ ఛానెల్‍లో ప్రసారమైంది. ప్రస్తుతం హాట్‍స్టార్‌లో హిందీలో ఒక్కటే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరి తెలుగు వెర్షన్ వస్తుందా అనేది చూడాలి.

ముంజ్య సినిమాకు ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. హారర్ ఎలిమెంట్లతో పాటు కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. సూపర్ హిట్‍గా నిలిచింది.

ముంజ్య సినిమాలో శార్వరి, అభయ్ వర్మతో పాటు సత్యరాజ్, మోనా సింగ్, సుహాస్ జోషి, తరణ్‍జ్యోతి సింగ్, అజయ్ పుర్కర్, ఆయుష్ ఉలగాడే, భాగ్యశ్రీ లిమయే కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా మెప్పించింది.

రూ.30 కోట్ల బడ్జెట్.. రూ.132 కోట్ల కలెక్షన్లు

ముంజ్య సినిమా రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, మొదటి నుంచి కలెక్షన్లలో దూసుకెళ్లింది. రెండో వారం నుంచి మరింత జోరు కనబరిచింది. ఈ చిత్రానికి లాంగ్ థియేట్రికల్ రన్ సాధ్యమైంది. దీంతో ఈ మూవీ సుమారు రూ.132 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది.

ముంజ్య సినిమాను మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీకి సచిన్ – జిగార్, జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు. ఈ మూవీకి సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చేయగా.. మోనిషా ఆర్ బల్‍దావా ఎడిటింగ్ చేశారు.

మహారాష్ట్రలోని కొంకన్ అనే గ్రామంలో ముంజ్య స్టోరీ మొదలవుతుంది. ప్రేమ కోసం చిన్నతనంలోనే చేతబడి చేసి.. అనుకోకుండా చనిపోయే ఓ పిల్లాడు ముంజ్య అనే దెయ్యంగా మారతాడు. ఆ తర్వాత ముంజ్య నుంచి తనను, తన ప్రేయసిని ఓ యువకుడు ఎలా కాపాడుకున్నాడన్న అంశం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కథనాన్ని ఉత్కంఠభరితంగా దర్శకుడు తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగి.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ కోసం కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024