ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
ది.10-8-2022 [బుధవారం] ..
వి.అన్నవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన రావు ,కేడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ..
చౌటపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పల్లెంపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన నిరుపయోగంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వీరులపాడు మండలం లోని వి.అన్నవరం గ్రామంలో కేడీసీసీ నిధులు రూ.35 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన రావు ,కేడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి బుధవారం ప్రారంభోత్సవం నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి గ్రామంలో శాశ్వత గ్రామ సచివాలయ భవనాలు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు ,రైతు భరోసా కేంద్రాల భవనాలు ,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు ,రైతులకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయి సిబ్బందితో అందుబాటులోకి తెస్తున్నారని వీటి వలన ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ,జడ్పిటిసి, గ్రామ సర్పంచులు , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ , మండల పార్టీ అధ్యక్షులు ,స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పిఎసిఎస్ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు ..