Best Web Hosting Provider In India 2024
జొన్నల వల్ల శరీరానికి ఎంతో మేలు. కానీ మనకు జొన్నలతో చేసిన ఆహారం అంటే ముందుగా గుర్తొచ్చేది జొన్న రొట్టెలే. జొన్న పిండితో చేసే అంబలి ఎండాకాలంలో తినగలం కానీ రోజూ తినడం కష్టమే. కానీ చాలా మందికి జొన్న రొట్టెలు చేయడం రాక జొన్నలను ఎలా వాడాలని ఆలోచిస్తారు. అయితే ఈ జొన్నలతో చేసే రెసిపీ ఐడియాలు మీకోసమే.ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. జొన్నలు బరువు తగ్గించడంలో కూాడా సాయపడతాయి.
1. జొన్నలతో సలాడ్:
కావాల్సిన పదార్థాలు:
3 విజిళ్ల పాటూ ఉడికించిన కప్పు జొన్నలు
సగం కప్పు కీరదోస ముక్కలు
సగం కప్పు టమాటా ముక్కలు
పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు
చెంచా నిమ్మరసం
కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి
తయారీ:
ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన జొన్నలు, కూరగాయల ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి కలపాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి మరోసారి బాగా షేక్ చేసి కలిపారంటే సలాడ్ రెడీ.
2. జొన్న దోశ:
కావాల్సినవి:
1 కప్పు జొన్న పిండి
పావు కప్పు బియ్యం పిండి
పావు కప్పు రవ్వ
సగం చెంచా జీలకర్ర
2 పచ్చిమర్చి సన్నటి తరుగు
అల్లం ముక్క తరుగు
తగినంత ఉప్పు
2 చెంచాల నూనె
జొన్న దోశ తయారీ:
ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి, బియ్యం పిండి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు కలపాలి.
అందులో నీళ్లు పోసుకుని దోశ పిండి లాగా పలుచగా కలుపుకోవాలి.
పెనం మీద నూనె రాసి గరిటె పిండితో దోశ లాగా పోసి రెండు వైపులా కాల్చుకుంటే జొన్న దోశ రెడీ. చట్నతో సర్వ్ చేసుకుంటే చాలు.
3. జొన్నల కిచిడి:
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు జొన్నలు
పావు కప్పు పెసరపప్పు
1 కప్పు అన్ని కూరగాయల ముక్కలు
అరచెంచా జీలకర్ర
పావు చెంచా పసుపు
చెంచాడు ఉప్పు
3 కప్పుల నీల్లు
1 చెంచా నెయ్యి లేదా నూనె
తయారీ విధానం:
1. ముందుగా జొన్నలను నీళ్లలో నానబెట్టుకోవాలి. రెండు గంటలయ్యాక బయటకు తీసేయాలి.
2. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసుకుని వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి.
3. అది వేగాక కూరగాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాలు బాగా మగ్గాక అందులో నానబెట్టుకున్న జొన్నలు, పెసరపప్పు, పసుపు, ఉప్పు, నీల్లు వేసుకోవాలి.
4. కుక్కర్ మూత పెట్టుకుని మూడ్నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
5. మూత తీసి బాగా కలపుకుని ఏదైనా పచ్చడితో సర్వ్ చేశారంటే అదిరిపోతుంది.
4. జొన్నల సూప్:
కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు జొన్నలు
1 కప్పుల కూరగాయల ముక్కలు అన్నీ కలిపి
2 వెల్లుల్లి రెబ్బల తరుగు
1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు
3 కప్పులు కూరగాయలు ఉడికించిన నీళ్లు
కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి
1 చెంచా నూనె
తయారీ:
ముందుగా మూడు గంటల పాటు జొన్నల్ని నానబెట్టుకోవాలి.
ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. వేడెక్కాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి.
కూరగాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. చివరగా కూరగాయలు ఉడికించిన నీల్లు పోసుకోవాలి.
వీటిలో నానబెట్టుకున్న జొన్నలు, ఉప్పు, మిరియాలు వేసుకోవాలి.
సన్నం మంట మీద కానీసం పావుగంట సేపు ఉడికించుకోవాలి. చివరగా మీకిష్టముండే ఆరిగానో లేదా కొత్తిమీర తరుగు వేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవడమే.