Aay 10 days Box Office: జోరు కొనసాగిస్తున్న ఆయ్ సినిమా.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే..

Best Web Hosting Provider In India 2024


నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఆయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. రెండో వారంలో దుమ్మురేపింది. మ్యాడ్ చిత్రంతో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్.. ఇప్పుడు ఆయ్‍తో మరో విజయం అందుకున్నాడు. రెండో వీకెండ్‍లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది.

10 రోజుల కలెక్షన్లు ఇవే

ఆయ్ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.26 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ సెకండ్ శనివారం ఏకంగా రూ.1.26 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. రిలీజైన ఫస్ట్ శనివారం రూ.1.30 కోట్లు రాగా.. వారం తర్వాత కూడా అదే జోరు చూపింది.

పోటీ ఉన్నా..

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ అంచనాలతో అడుగుపెట్టిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు పోటీగా చిన్న చిత్రంగా ఆయ్ వచ్చింది. అయితే, ఆ రెండు చిత్రాలకు నెగెటివ్ టాక్ రాగా.. ఆయ్ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆయ్ జోరు చూపిస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయింది.

ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, ఫ్రెండ్‍షిప్‍, కులం అంశాలతో గోదావరి విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీని తెరకెక్కించారు. కామెడీతో ఎంటర్‌టైనింగ్‍గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. దీంతో ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. ఓపెనింగ్ మోస్తరుగా వచ్చినా.. ఆ తర్వాత కలెక్షన్లు, థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది.

ఆయ్ సినిమాలో నార్నే నితిన్, సారికతో పాటు కసిరెడ్డి రాజ్‍‍కుమార్, అంకిత్ కొయ్య మెయిన్ రోల్స్ చేశారు. ఈ నలుగురి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి బలంగా నిలిచింది. రాజ్‍కుమార్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ మూవీలో వినోద్ కుమార్, మైమ్ గోపీ కూడా కీలకపాత్రలు పోషించారు.

ఆయ్ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించగా.. సమీర్ కల్యాణి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో గోదావరి అందాలను కూడా మేకర్స్ బాగా చూపించారు. ఈ మూవీకి కొదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ చేశారు.

ఆయ్ మూవీని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు. తమ సినిమాపై మేకర్స్ మొదటి నుంచి నమ్మకంతోనే ఉన్నారు. అందుకే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ పోటీలో ఉన్నా వెనక్కి తగ్గలేదు. అందుకు తగ్గట్టే కంటెంట్ ఉండటంతో ఆయ్ మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది మూవీ టీమ్.

ఆయ్ సినిమాకు స్క్రీన్‍ల సంఖ్య కూడా పెరిగింది. పోటీ ఉండటంతో ముందుగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 థియేటర్లు మాత్రం దక్కాయి. అయితే, ఆ తర్వాత క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ఆయ్ చిత్రం 380 స్క్రీన్‍లలో ఉందని నిర్మాత బన్నీ వాస్ ఇటీవల సక్సెస్ మీట్‍లో చెప్పారు. ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా స్టడీగా కొనసాగుతున్నాయి. 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024