Best Web Hosting Provider In India 2024
Amaravati Jobs : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏర్పడిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్)లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డిజైన్, హార్టికల్చర్, ఫైనాన్స్ మేనేజర్, సీఎండీ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆగస్టు 29 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆ లోపు ఈ మెయిల్ ద్వారా అర్హులైన అభ్యర్థులు రెజ్యూమ్ లేదా సీవీను పంపించాల్సి ఉంటుంది.
మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ లేదా అమరావతిలో పోస్టింగ్ ఇస్తారు. అభ్యర్థి విద్యార్హత, అనుభవం ఆధారంగా జీత భత్యాలు నిర్ణయిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక ఈ-మెయిల్ recruitment.adcl@gmail.com కు రెజ్యూమ్ లేదా సీవీను పంపించాల్సి ఉంటుంది. అలాగే మెయిల్ చేసేటప్పుడు జాబ్ కోడ్, జాబ్ టైటిల్‌ను పేర్కొనాలి.
38 పోస్టులు
- హెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ డిజైన్-1,
- సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానర్-3,
- సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్-3,
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్-2,
- డాక్యుమెంట్ కంట్రోలర్-1,
- సీనియర్ బ్రిడ్జ్ ఇంజినీర్-2,
- సీనియర్ ఇంజినీర్-2,
- అసోసియేట్ ఇంజినీర్-2,
- అసిస్టెంట్ ఇంజినీర్-2,
- హెడ్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-1,
- సీనియర్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్-1,
- ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్-1, ఆర్కిటెక్-1,
- హార్టికల్చర్ ఆఫీసర్-4,
- ఫీల్డ్ ఆఫీసర్ (హార్టికల్చర్)-4,
- ఫీల్డ్ సూపర్ వైజర్ (హార్టికల్చర్)-4,
- మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్)-1,
- అసిస్టెంట్ మేనేజర్ (అడ్మిన్)-2,
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టూ సీఎండీ-1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు (జాబ్ కోడ్‌లు, జాబ్ టైటిల్, అలాగే జాబ్ అర్హతలు) తెలుసుకోవాలనుంటే ఈ లింక్‌ను https://drive.google.com/file/d/1tXcwwuDB1JYztGZxfGR-_GWom403H5-I/view క్లిక్ చేయండి. అప్లై చేసికున్న అభ్యర్థులు షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. జీతానికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్‌లో వెలువరించలేదు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్