BRAOU Updates : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు – దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్, లింక్స్ ఇవే

Best Web Hosting Provider In India 2024


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఆగస్టు 31వ తేదీతో పూర్తి కానుంది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Open PDF in New Window

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది. ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వీటిని పూర్తి చేయవచ్చు. ఏడాది లేదా ఆరు నెలల కాలంలో పూర్తి చేసే డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి.  అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

ముఖ్యమైన లింక్స్ ఇవే:

  • అధికారిక వెబ్ సైట్ – https://www.braouonline.in/ 
  • పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ – https://online.braou.ac.in/PG/PGFirstHome 
  • డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ – https://online.braou.ac.in/UG/UGFirstHome 

మరోవైపు ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు(ఫస్ట్ ఫేజ్) దరఖాస్తులు కోరుతూ ఇటీవలే నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది. ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://oupgrrcde.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

టాపిక్

Telangana NewsTrending TelanganaEducationAdmissionsOsmania UniversityKakatiya University

Source / Credits

Best Web Hosting Provider In India 2024