Best Web Hosting Provider In India 2024
ConoCarpus Side Effects: మనదేశంలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అలాంటి మొక్కల్లో కోనో కార్పస్ మొక్కలు ఒకటి. ఈ మొక్కలు నాటిన తర్వాత పెద్ద చెట్లుగా ఎదుగుతాయి. ఇవి మన దేశానికి చెందినవి కాదు. అన్య జాతుల మొక్కలు. అరబ్ దేశాల్లో కోనో కార్పస్ చెట్లను విరివిగా పెంచేవారు.
ఇవి గుబురుగా పచ్చదనంతో నిండి ఉంటాయి. చూసేందుకు పచ్చగా ఉంటాయి. కాబట్టి అందరూ ఇష్టంగా పెంచేవారు. అయితే ఇవి మనిషికి ఎంతో అనారోగ్యాన్ని కలిగిస్తాయని, పర్యావరణానికి హానికరం అని తెలుసుకున్నాక అరబ్ దేశాలు కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి. వాటిని నరికివేసాయి. ఇప్పటికే గుజరాత్‌లో ఈ మొక్కలపై ఎప్పుడో నిషేధం పడింది. ఒక్కోరాష్ట్రం ఈ చెట్లపై నిషేధాన్ని విధిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏపీ రాష్ట్రం వంతు వచ్చింది. వాటిని పెంచవద్దని చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ చెట్లు మనకి ఎలా హానికరమో తెలుసుకుందాం.
గత కొన్ని సంవత్సరాలగా మన దేశాల్లో వేలాదిగా కోనో కార్పస్ చెట్లను నాటారు. ఇవి చూసేందుకు పచ్చగా కనిపిస్తూ నీడనిచ్చేలా ఉంటాయి. అందుకే పార్కుల్లో కూడా వీటిని నాటేవారు. రోడ్లు పక్కన కూడా ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటివల్ల మనిషి మనుగడకు, ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిశాక వాటిని నరికేయడం, ఆ మొక్కల్ని పెంచకపోవడం మొదలైంది. గుజరాత్లోనూ ఇతర కొన్ని రాష్ట్రాల్లో కూడా కోనోకార్పస్ చెట్లపై నిషేధం విధించారు.
కోనో కార్పస్ చెట్ల వల్ల కలిగే హాని
ఈ మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికీ, మనిషికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ చెట్లు అధికంగా పెంచితే అవి భాష్పీభవన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దాని వేళ్లు భూమిలో ఉన్న డ్రైనేజీ పైపుల్ని కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండుసార్లు పరాగసంపర్కం చేస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం. పరాగసంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు అధికంగా వచ్చేలా చేస్తాయి.ఇవి ఎంతో మొండి మొక్కలు. ఒక్కసారి వేశామంటే అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకొని పెరిగేస్తాయి. ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అందుకే ఇవి ఒక్కసారి నాటితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పెరిగేస్తాయి. చెట్లుగా ఎదిగిపోతాయి.
నీటి కొరత తప్పదు
ఈ చెట్లను అధికంగా నాటితే భూగర్భ జలాల నిల్వలు కూడా తగ్గిపోతాయి. ఏడేళ్ల క్రితం వడోదరలో 24000 చెట్లను నాటారు. కొన్ని రోజులకే ఆ ప్రదేశంలో భూగర్భ జలాలు నిల్వలు తగ్గిపోయాయి. దాదాపు లక్ష లీటర్ల వరకు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇలాగే కొనసాగితే ఆ నగరంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ మొక్కలు పెంచడం వల్ల నీటి కొరత వచ్చే అవకాశం ఎక్కడైనా ఎక్కువే .
ఈ మొక్కల ఆకులను పక్షులు కానీ జంతువులు గానీ తినవు. వీటి రుచి జంతువులకు నచ్చదు. ఈ చెట్ల వేర్లు భూమి లోపలికి చాలా విస్తృతంగా వేగంగా అభివృద్ధి చెందుతాయి. టెలీ మ్యూనికేషన్ లైన్లు, డ్రైనేజీ నెట్‌వర్క్‌లు, మంచినీటి వ్యవస్థలను దెబ్బతీస్తాయి.
ఈ చెట్లు ఉన్న ప్రాంతంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు నివసించలేరు. ఆస్తమా ఉన్నవారికి కూడా ఈ చెట్లు హానికరమైనవి. ఇవి వారికి దగ్గరగా మారుతాయి. దగ్గు, జలుబు, పొట్ట ఉబ్బసం బారిన త్వరగా పడేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి చెట్లకు, మొక్కలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
టాపిక్