Lokesh Wishes to NBK: ‘బాల‌ మామ‌య్యా…స‌రిలేరు నీకెవ్వ‌ర‌య్యా..’ – నారా లోకేశ్ విషెష్

Best Web Hosting Provider In India 2024


నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మేనల్లుడు, మంత్రి నారా లోకేశ్…విషెష్ చెప్పారు. ‘బాల‌ మామ‌య్యా..స‌రిలేరు నీకెవ్వ‌ర‌య్యా!’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

50 ఏళ్లుగా వెండితెర‌పై తిరుగులేని క‌థానాయ‌కుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామ‌య్య‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘తాతమ్మకల’తో 1974వ సంవ‌త్స‌రంలో తెరంగేట్రం చేసిన మామ‌య్య వేయ‌ని పాత్ర లేదు.. చేయ‌ని ప్ర‌యోగం లేదు. ఐదు ద‌శాబ్దాల‌లో హీరోగా 109 సినిమాల‌లో న‌టించి అవార్డులు-రివార్డులు అందుకుని రికార్డు సృష్టించారు” అని పేర్కొన్నారు.

“ప్ర‌యోజ‌నాత్మ‌క‌, ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాల మామ‌య్య పేరుగాంచారు. సాంఘిక‌, పౌరాణిక‌, వినోద ప్ర‌ధాన‌మైన చిత్రాల‌లో హీరోగా న‌టించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అగ్ర‌హీరోగా వెలుగొందుతూనే.. రాజ‌కీయాల్లో రాణిస్తూ..సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సులు గెలుచుకున్న అన్ స్టాప‌బుల్ హీరో మా బాల మామ‌య్య‌..” అంటూ లోకేశ్ తన పోస్టులో ప్రస్తావించారు.

టాపిక్

Nara LokeshAndhra Pradesh NewsBalakrishna

Source / Credits

Best Web Hosting Provider In India 2024