Best Web Hosting Provider In India 2024
అనంతపురం: ప్రతి ఇంటిలో పెద్ద కొడుకుగా ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం, రోటరీపురం గ్రామం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ ఇంట్లో ఏ చిన్న సాయం జగనన్న ద్వారా అందినా ఎవరు మరిచి పోవద్దని అన్నారు. ఓటు వేసి ఆ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న మళ్లీ సీఎం అయితేనే పేదవాళ్ల జీవితాలు మారుతాయని, వారి పిల్లలు మరింత ఉన్నతంగా రాణిస్తారని తెలిపారు. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయని నిరుద్యోగ సమస్య మళ్లీ తీవ్రతరం అవుతుందని అన్నారు.