Best Web Hosting Provider In India 2024
యోగా వేలాది సంవత్సరాలుగా అభ్యసిస్తోన్న విద్య. దీంతో డిప్రెషన్‌తో సహా వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులను తగ్గించుకోవచ్చు. నిరాశగా అనిపించినా, ఏదో కోల్పోయినట్లు ఉన్నా మీలో ఉత్సాహం నింపే యోగాసనాలు కొన్ని ఉన్నాయి.
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అక్షర్ యోగా కేంద్రం వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే అనేక యోగా పద్ధతులను సూచించారు
1. సూర్య నమస్కారాలు (సూర్య నమస్కారాలు):
ఈ ఆసనాల క్రమం వాటి లయబద్ధమైన స్వభావంతో మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతాయి. ప్రతిరోజూ 5-10 రౌండ్లు వీటిని సాధన చేయడం, ముఖ్యంగా ఉదయం పూట చేయడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
2. వెనక్కి వంగి చేసే వ్యాయామాలు:
భుజంగాసనం, సేతు బంధనాసనం, ఉస్ట్రాసన వంటి భంగిమలు ఛాతీ, గుండె ప్రాంతానికి మంచి వ్యాయామాలు. ఈ భంగిమలు శక్తినిచ్చి ఉత్సాహాన్ని పెంచుతాయి. నిరాశ తగ్గిస్తాయి. మానసిక స్థితిని పెంచడంలో సహాయపడతాయి.
3. తలకిందులుగా చేసే వ్యాయామాలు
తలకిందులుగా నిలబడి చేసే భంగిమలు శీర్షాసనం, సర్వాంగాసనం, లేదా విపరితా కరణి లాంటివి నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఈ భంగిమలు కొత్త శక్తి ఇస్తాయి.
4. ముందుకు వంగడం:
పశ్చిమోత్తనసనం, ఉత్తనాసనం నాడీ వ్యవస్థపై శాంతపరుస్తాయి. ఈ భంగిమలు మనస్సును శాంతపరచడంలో సహాయపడతాయి. తరచుగా నిరాశతో బాధపడుతుంటే వీటిని తప్పకుండా యోగా క్రమంలో భాగం చేసుకోవాలి.
5. శరీర సమతుల్యత:
వృక్షాసనం,వీరభద్రాసనాలు చేయడానికి ఏకాగ్రత అవసరం. ఇది ప్రతికూల ఆలోచనల నుండి దృష్టిని మళ్లించడానికి సహాయపడుతుంది. శారీరక సమతుల్యత కోసం దృష్టి కేంద్రీకరించడం వల్ల భావోద్వేగాల సమతుల్యత మెరుగవుతుంది.
6. ప్రాణాయామాలు:
శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ప్రాణాయామాలు మానసికంగా ప్రభావం చూపుతాయి. ఈ శ్వాస వ్యాయామలు చేసిన తర్వాత సత్వరమే మానసిక ప్రశాంతత పెరిగిన భావన వస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
7. యోగ నిద్ర:
“యోగ నిద్ర” అని పిలువబడే ఈ ధ్యాన అభ్యాసంలో శవాసనంలో పడుకుంటారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. యోగా నిద్రను క్రమం తప్పకుండా అభ్యసించడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
8. మంత్ర ధ్యానం:
యోగాభ్యాసం లేదా ధ్యానం చేసేటప్పుడు ఏదైనా మంత్రం లేదా పదం జపించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనా విధానాల నుండి మనస్సును మళ్ళించడానికి సహాయపడుతుంది. “సో హమ్”, ఓం వంటి సాధారణ మంత్రాలు లేదా మీరు అనుకుంటున్న లక్ష్యాలకు చేర్చే మాటలు జనం లాగా అనుకోవచ్చు.
ఈ యోగా పద్ధతులను నిరంతరం అభ్యసించడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. యోగా అభ్యాసంలో అంతర్లీనంగా ఉండే శారీరక కదలిక, శ్వాస మీద దృష్టి నిరాశ తగ్గిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలతో ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.
టాపిక్