Warangal Rains : ధ్వంసమైన రైల్వే ట్రాక్.. తప్పిన పెనుప్రమాదం! నిలిచిపోయిన పలు రైళ్లు

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ వద్ద పెనుప్రమాదం తప్పింది. స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.

సమీపంలో ఉన్న చెరువు కట్టు తెగటంతో ఈ ఘటన జరిగింది, ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది.  రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మహబూబాబాద్ లోనే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.

మరోవైపు విజయవాడ-వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు.

 

 

 

టాపిక్

TrainsAp RainsTs RainsTelangana NewsWarangal

Source / Credits

Best Web Hosting Provider In India 2024