Best Web Hosting Provider In India 2024
క్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆగస్టు 31వ తేదీతో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి గడువును పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.
ముఖ్య వివరాలు :
- హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు.
- పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది.
- ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
- అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వీటిని పూర్తి చేయవచ్చు.
- ఏడాది లేదా ఆరు నెలల కాలంలో పూర్తి చేసే డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
- ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.
- కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన లింక్స్ ఇవే:
- అధికారిక వెబ్ సైట్ – https://www.braouonline.in/
- పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ – https://online.braou.ac.in/PG/PGFirstHome
- డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ – https://online.braou.ac.in/UG/UGFirstHome
- డిప్లోమా కోర్సుల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్ లింక్ – https://online.braou.ac.in/PG/PGFirstHome
ఓయూ దూర విద్యలో ప్రవేశాలు – దరఖాస్తులు ప్రారంభం :
ఓయూ దూర విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(ఓయూ) విభాగం ద్వారా ఈ కోర్సులను అందిస్తున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి అప్లికేషన్ చేయటంతో పాటు ట్యూషన్ ఫీజును కూడా చెల్లించవచ్చు. అడ్మిషన్లు పొందే విద్యార్థులు సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాలి.
మరోవైపు పీహెచ్ డీ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సబ్జెక్టులతో పాటు ఖాళీల వివరాలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అక్టోబరు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
టాపిక్