Jyothi Rai: ఇంట్లోవాళ్లు న్యూడ్‌గా కనిపిస్తే రేప్ చేస్తావా.. ఘాటుగా ప్రశ్నించిన గుప్పెడంత మనసు జగతి

Best Web Hosting Provider In India 2024


Guppedantha Manasu Jyothi Rai Comments: తెలుగు రాష్ట్రాల్లో గుప్పెడంత మనసు సీరియల్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇందులోని రిషి, వసుధార, జగతి, మహేంద్ర పాత్రలకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తల్లికొడుకుల ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సీరియల్ తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది.

గ్లామర్ ఫొటోలతో

అయితే, తాజాగా శనివారం (ఆగస్ట్ 31) గుప్పెడంత మనసు సీరియల్‌కు శుభం కార్డ్ పడింది. 1168 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్‌లో తల్లిగా ఎంతో వైవిధ్యమైన నటన కనబరించింది జ్యోతి రాయ్. ఆమె పోషించిన జగతి పాత్ర ఎప్పుడో మరణించినప్పటికీ సీరియల్‌లో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాగే రియల్ లైఫ్‌లో సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో మరింత హైలెట్ అయింది జ్యోతి రాయ్.

జ్యోతి రాయ్ ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాతోపాటు ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే ఓటీటీ సిరీసులు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, గుప్పెడంత మనసు పూర్తయిన సందర్భంగా ప్రముఖ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు సీరియల్‌లోని నటీనటులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి రాయ్ కోల్‌కత డాక్టర్ రేప్ విషయంపై మాట్లాడింది.

అమ్మాయిలే నెగెటివ్‌గా

“అమ్మాయిలే అమ్మాయిలకు శత్రువలండి. ఇప్పుడు మొన్న రేప్ జరిగింది. ఆ న్యూస్‌కు సంబంధించి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఆ రేప్‌కు గురైన అమ్మాయి గురించి అమ్మాయిలే నెగెటివ్‌గా చెబుతున్నారు. అలా ఇంకొకరి గురించి మీరు ఎలా మాట్లాడుతారు. ఎక్కడో గాలిలో ఒక న్యూస్ వచ్చింది నువ్ పెట్టేస్తావా” అని జ్యోతి రాయ్ ప్రశ్నించింది.

“దానిమీద నీకు డబ్బులు వస్తాయి. కానీ, రేపు నీ ఫ్యామిలీలో ఎవరికైనా అలా అయితే.. అప్పుడు నువ్ ఎలా మాట్లాడగులుగుతావ్. ఎలా జడ్జ్ చేస్తావ్. అలా చేయకండి” అని జ్యోతి రాయ్ చెప్పింది. ఏమైనా రిగ్రీట్స్ ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నిస్తే.. “అంటే సినిమా గురించి నేను అప్పుడే ఆలోచించాల్సిందేమో. లైఫ్ అంతా ఒక స్క్రిప్ట్ అండి. ఇది ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటుందేమో” అని జ్యోతి రాయ్ చెప్పుకొచ్చింది.

న్యూడ్‌గా చూస్తే రేప్ చేస్తావా

తర్వాత తనకు వచ్చే పర్సనల్ మెసేజెస్ గురించి జ్యోతిరాయ్ తెలిపింది. “ఒకరోజు నాకు పర్సనల్‌గా వచ్చే మెసేజెస్ చూపిస్తే షాక్ అయిపోతారు జనాలు. అంటే, నిన్ను నువ్ శ్రీరామచంద్రుడిలా చూపించుకుంటావ్. మళ్లీ ఇలా చెత్త మెసేజ్‌లు పంపిస్తావ్, చెత్త వాగుడు వాగుతావ్. ఎలా.. నేను అంటున్నా.. ఇప్పుడు నీ అక్క, నీ చెల్లి, నీ అమ్మ.. ఒకవేళ నేక్‌డ్‌గా చూస్తే నువ్ వాళ్లను రేప్ చేస్తావా. రేపు నీ కూతురుని నేక్‌డ్‌గా చూస్తే రేప్ చేస్తావా” అని జ్యోతి రాయ్ చాలా ఘాటుగా ప్రశ్నించింది.

తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ గురించి మాట్లాడుతూ.. “మనం ఏం చేసిన ఒక హ్యాపీ మెమోరీస్ ఉండాలి. అంటే ఒక పర్ఫామర్స్‌కి ద టైటిల్ మ్యాటర్స్‌ కాదు. ఆ క్యారెక్టర్ ముఖ్యం” అని జ్యోతి రాయ్ తెలిపింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024