Best Web Hosting Provider In India 2024
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) జులై సెషన్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ignou.ac.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే, చివరి తేదీ సెప్టెంబర్ 10 లోపు చేసుకోండి. రిజిస్ట్రేషన్ గడువును ఇగ్నో పొడిగించింది. అయితే నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం.
ఇగ్నో అడ్మిషన్ 2024-1 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అభ్యర్థి ignou.ac.in ఇగ్నో అధికారిక వెబ్సైట్ వెళ్లాలి.
ఆ తర్వాత ‘జూలై అడ్మిషన్ 2024’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
దీని తరువాత, మీకు కొత్త పేజీలో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్ లింక్ వస్తుంది.
రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి.
ఇప్పుడు మీకు నచ్చిన కోర్సును ఎంచుకోవాలి.
ఇప్పుడు ఫీజు చెల్లించి, ఆ తర్వాత కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్ తీసుకోవాలి.
ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలి
స్కాన్ చేసిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
స్కాన్ చేసిన సంతకం.
విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ స్కాన్ చేయాలి.
కేటగిరీ సర్టిఫికేట్.
అప్లోడ్ చేయడానికి అభ్యర్థి ఫొటో, సంతకం డాక్యుమెంట్ పరిమాణం 100 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కాకుండా పైన పేర్కొన్న ఇతర డాక్యుమెంట్ల పరిమాణం 200 కేబీకి మించకూడదు. అన్ని ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లకు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఇగ్నో వెబ్సైట్లో పూర్తి సమాచారం చదవాలి.
తెలుగు రాష్ట్రాల్లోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్లోనే నేరుగా చేయవచ్చు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link