Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: కుట్రల చంద్రబాబు జీవితమే ఒక కేస్ స్టడీ అవుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలోనే జరిగిందని, ఈ కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని, ఈ కేసులో భాదితుల్ని నిందితులుగా చిత్రీకరించే యత్నం జరుగుతోందని, అన్నింటికి మించి సీఎంవైయస్ జగన్‌పై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే ఇదంతా అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. వివేకా హత్య కేసు ద్వారా సీఎం జగన్‌పై రాజకీయ కుట్ర జరుగుతోంది. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరి బయటకు వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి?. గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత మౌనంగా ఎందుకు ఉన్నారు?. సునీత భర్తకు ఈ హత్యలో సంబంధం ఉందని ఆరోపించారు సుధాకర్‌బాబు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.