Best Web Hosting Provider In India 2024
NNS 02nd September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 2) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ ఎప్పటికీ నా భార్యకు చెల్లి మాత్రమే కానీ, నా భార్య కాలేదు అంటాడు అమర్. అలా అనొద్దు సార్ అంటూ రాథోడ్ బాధపడతాడు. అరుంధతి ఆశ్శీసులతోనే మీ ఇద్దరి పెళ్లి జరిగిందేమో అనిపిస్తుంది అంటాడు. అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ మీకు అనుకోకుండా పెళ్లి అయిపోయింది. అంటేనే అర్థం చేసుకోవాలి సార్ అంటూ రాథోడ్ ఎమోషనల్ అవుతాడు.
భాగీ చేతుల్లో పట్టు పంచె
మరోవైపు రామ్మూర్తి , మంగళ వస్తారు. మిస్సమ్మ టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో మంగళ కంగారుగా టీ తీసుకోబోయి రామ్మూర్తి మీద పోస్తుంది. దీంతో రామ్మూర్తి పంచె పాడవుతుంది. మిస్సమ్మ లోపలికి వెళ్లి ఇంకో పంచె తీసుకొస్తానని కప్ బోర్డు ఓపెన్ చేస్తుంది. కప్‌బోర్డులో నుంచి అమర్ దాచిన ఆరు చిన్నప్పటి పంచె మిస్సమ్మ చేతుల్లో పడుతుంది.
పట్టు పంచె.. ఈయన ఎప్పుడూ ఇలాంటివి కట్టలేదే.. అనుకుని పంచె కోసం వెతుకుతుంది భాగీ. మిస్సమ్మ ఏంటండి ఇంకా రాలేదు అంటుంది నిర్మల. పంచె కనిపించలేదేమో.. బావగారు ఉండండి నా పంచె తీసుకుని వస్తాను అంటాడు శివరామ్. అయ్యోయ్యో పర్వాలేదు బాబుగారు అంటాడు రామ్మూర్తి. ఏంటి బావగారు మీ కూతురినే మా ఇంటికి పంపారు. మీకు పంచె ఇవ్వలేనా? అంటూ లోపలికి వెళ్లగానే మిస్సమ్మ పంచె తీసుకుని వస్తుంది.
పట్టు పంచె చూసిన రామ్మూర్తి
దూరం నుంచే ఆ పంచె చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఇప్పుడు ఈ ముసలోడు చూస్తే ఎలా అని భయపడుతుంది. ఇంతలో శివరాం. పంచె తీసుకుని వస్తాడు. మిస్సమ్మ కూడా పంచె తీసుకుని వచ్చి ఇవ్వబోతుంది. ఆ పంచెను చూసిన రామ్మూర్తి ఆరును గుర్తు చేసుకుని షాక్ అవుతాడు. పిచ్చి పట్టినవాడిలా నా బిడ్డ అంటూ తిరుగుతాడు.
నాన్నా ఏమైంది నాన్నా… ఎందుకిలా అయిపోయారు అంటుంది మిస్సమ్మ. అమ్మా ఈ పంచె నీకు ఎక్కడిదమ్మా అని అడుగుతాడు రామ్మూర్తి. ఆయన కప్ బోర్డులో ఉంది నాన్నా.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయనదేమో అని తీసుకొచ్చాను అంటుంది మిస్సమ్మ. బాబు గారు ఎప్పుడొస్తారమ్మా.. అంటాడు రామ్మూర్తి. లేటు అవుతుందని చెప్పారు నాన్నా.. ఏమైంది..? అంటుంది మిస్సమ్మ.
ఏం లేదు అమ్మా.. ఏం లేదు.. అంటాడు రామ్మూర్తి. సరే నాన్నా మీరు ఈ పంచె రూముకు వెళ్లి మార్చుకుని రండి అని చెప్పి పట్టు పంచె తీసుకుని పైకి వెళ్లిపోతుంది. మనోహరి షాకింగ్ గా చూస్తుండి పోతుంది.
రామ్మూర్తి కష్టం తీరుస్తానన్న ఆరు
రామ్మూర్తి అటూ ఇటూ తిరుగుతుంటూ.. అమర్ కోసం ఎదురుచూస్తుంటాడు. గుప్త గారు ఆయన ఇందాకటి నుంచి ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నారు అంటుంది అరుంధతి. బాలికా ఆయన అటు నుంచి ఇటే కాదు ఇటు నుంచి అటు కూడా తిరుగుతున్నాడు అంటాడు గుప్త. హస్యమా…? అంటున్న ఆరుతో నువ్వు పెట్టే చిత్రహింసలకు మాకు హాస్యము ఒక్కటే తక్కువయ్యింది అంటాడు.
అది కాదు గుప్త గారు ఆయనకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకుని వెంటనే తీర్చేయాలని ఉంది అంటుంది అరుంధతి. ముందు నీకున్న కష్టాల గురించి ఆలోచించు అంటాడు గుప్త. సమాధానం లేని ప్రశ్నల వెంట పడి ఏం ఉపయోగం లేండి గుప్త గారు. ఆయనకు నిజం తెలిసి కూడా చెప్పడం లేదంటే ఇంకెవరు నా జన్మరహస్యం చెప్తారు అంటుంది ఆరు.
రామ్మూర్తికి నిజం తెలుస్తుందా?
రామ్మూర్తి బాధపడిన విషయం గుర్తు చేసుకుంటుంది ఆరు. నేనే ఆ రామ్మూర్తి కూతురు ఎందుకు కాకూడదు. భాగమతి నా సొంత చెల్లెలు ఎందుకు కాకూడదు. నా స్థానంలోకి నా రక్తమే వచ్చి నా ప్రయాణాన్ని నా చెల్లెలే కంటిన్యూ చేస్తుంది. అబ్బా చెప్పడానికి ఎంత సంతోషంగా ఉంది అని ఆరు చెప్పగానే గుప్త షాక్ అవుతాడు. వెంటనే ఆరు మాటలను వెటకారంగా మార్చేస్తాడు.
ఇంతలో బయట రామ్మూర్తి, అమర్ కోసం తిరగడం పై నుంచి మనోహరి, మంగళ చూస్తుంటారు. ముసలోడికి నిజం తెలిసిపోయిందా? అని ఆలోచిస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. ఇంతదూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా? మీరు లోపలికి రండి అని పిలుస్తుంది. అల్లుడు గారు వచ్చాకా నేను వస్తాను నువ్వు వెళ్లి తల్లి అంటాడు రామ్మూర్తి.
అమర్ అరుంధతి గురించి నిజం రామ్మూర్తికి చెబుతాడా? నిజం బయటపడకుండా మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
Best Web Hosting Provider In India 2024
Source / Credits