Best Web Hosting Provider In India 2024
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ షురూ అయింది. 14 మంది కంటెస్టెంట్లు.. ఏడు జంటలుగా హౌస్‌లోకి అడుగుపెట్టేశారు. ఆదివారం (సెప్టెంబర్ 1) గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో ఈ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో 12వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లారు యాంకర్ విష్ణుప్రియ. ఈ సీజన్లో విష్ణుప్రియ ఉంటారని చాలా కాలంగా రూమర్లు వస్తుండగా.. అదే నిజమైంది. అయితే, గతంలో బిగ్‌బాస్‌లోకి వెళ్లడం గురించి విష్ణుప్రియ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో వైరల్ అవుతోంది.
కోట్లిచ్చినా వెళ్లను.. ఎంకరేజ్ చేయను
బిగ్‌బాస్‌కు తాను వెళ్లనని, ఎంకరేజ్ కూడా చేయనని విష్ణుప్రియ ఆ వీడియోలో అన్నారు. తాను బిగ్‌బాస్‌కు వెళితే తిట్టొచ్చని కూడా చెప్పారు. “ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్లను. ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు.. ఎందుకు ఏదో హౌస్‌లోనే ఉండాలండి. ఇంట్లో వాళ్లను చూసుకోవాలి. నేను బిగ్‌బాస్ కూడా ఎప్పుడూ చూడలేదు” అని విష్ణుప్రియ అన్నారు.
తాను బిగ్‌బాస్ పర్సన్ కాదని, తాను ఎంకరేజ్ కూడా చేయనని విష్ణుప్రియ అన్నారు. “నేను వెళ్లడం అసాధ్యం. వెళితే నన్ను తిట్టొచ్చు” అని అప్పట్లో చెప్పారు. ఈ వీడియో ఐదేళ్ల కిందటిది అని తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లోకి విష్ణుప్రియ వెళ్లడంతో ఇందుకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
మద్దతుగా..
ఈ పాత వీడియో వైరల్ అవుతుండగా.. విష్ణుప్రియకు కొందరు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయని, దీనికి తప్పబట్టడం సరైనది కాదని కొందరు అంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆమె బిగ్‌బాస్‌లోకి వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. కెరీర్లో ఎదిగేందుకు బిగ్‌బాస్ మంచి అని ఆప్షన్ భావించి ఉంటారని, ఆమెకు సపోర్ట్ చేయాలని కొందరు విష్ణుప్రియకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
విష్ణుప్రియ కెరీర్ ఇలా..
విష్ణుప్రియ ముందుగా సినిమాల్లోనే ఎంట్రీ ఇచ్చారు. కొన్ని తెలుగు, తమిళం చిత్రాల్లో చిన్నపాత్రలు చేశారు. అయితే, పెద్దగా అవకాశాలు, సక్సెస్ రాలేదు. దీంతో టీవీ యాంకరింగ్ వైపు వచ్చారు. ఈటీవీలో ‘పోవేపోరా’ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేశారు. ఈ షోతో విష్ణుప్రియ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేశారు.
టీవీ షోలకు యాంకరింగ్ ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు విష్ణుప్రియ. కొన్ని స్పెషల్ టీవీ ఈవెంట్లలోనూ మెరిశారు. ఆ తర్వాత.. చెక్‌మేట్ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు విష్ణుప్రియ. వాంటెడ్ పండుగాడు సినిమాలోనూ నటించారు. దయా వెబ్ సిరీస్‌లోనూ కీలకపాత్ర పోషించారు.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో ఇటీవలే విష్ణుప్రియ కనిపించారు. ప్రస్తుతం విష్ణుప్రియ చేతిలో ఏ టీవీ షోలు, సినిమాలు లేవు. దీంతో తన కెరీర్‌కు బిగ్‌బాస్ బూస్ట్ ఇస్తుందనే భావనతో హౌస్‌లోకి వెళ్లారు.
తరచూ తన ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు విష్ణుప్రియ. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాలోనే ప్రస్తుతం 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో బిగ్‌బాస్‌లో ఓటింగ్ కూడా ఆమెకు ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. హౌస్‌లో టాస్కులు బాగా ఆడి, మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తే టైటిల్ ఫేవరెట్‌గా విష్ణుప్రియ కొనసాగే అవకాశాలు ఉంటాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits