Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2023/04/MERUGA.jpg)
తాడేపల్లి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.