Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2023/04/botsa-inter-results2.jpg)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు.
►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్
►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్
►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్