ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
నిరుపేద విద్యార్థి పి.ప్రకాష్ ఉన్నత చదువులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి లా తాను కూడా గొప్ప డాక్టర్ ను కావాలని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపిన నిరుపేద విద్యార్థి ..
నందిగామ పట్టణంలోని 7 వ వార్డుకు చెందిన పి ప్రకాష్ అనే విద్యార్థి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో నాయనమ్మ పి.వెంకటరత్నమ్మ దగ్గరే ఉంటూ విద్యాభ్యాసం చేశాడు , ఆ నిరుపేద విద్యార్థికి విదేశాలలో MS చేసే అవకాశం రావడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని సంప్రదించగా ,వెంటనే స్పందించిన ఆయన పెద్ద హృదయంతో లక్ష రూపాయలను ఆ విద్యార్థికి విదేశీ చదువుల నిమిత్తం అందజేశారు ,
ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు చదువు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు కొన్ని ఆర్థిక కారణాల వలన మధ్యలోనే తమ ఉన్నత చదువులను వదిలేస్తున్నారని ,చదువు యొక్క విలువ మాటల్లో చెప్పలేనిదని , ఆ పేద విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలనే ఆకాంక్షతోనే సహాయం అందజేసినట్లు తెలిపారు ,ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మేము కష్టపడి చదువుకొనే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు ,కష్టపడి చదువుకునే విద్యార్థులను మా సోదరుడు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఎంతో ఆప్యాయతతో సహకరిస్తారని తెలిపారు ,
అనంతరం తల్లిదండ్రులు లేని నాకు ఒక పెద్ద దిక్కుగా- కుటుంబ సభ్యుడిగా సొంత అన్నలా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు నా చదువులకు సహాయం అందించారని , వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ప్రేరణతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వస్తానని , ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిలా తాను కూడా డాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు ,
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..