HYDRA Demolitions : 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాల భూమి స్వాధీనం – వివరాలను వెల్లడించిన ‘హైడ్రా’

Best Web Hosting Provider In India 2024


అక్రమ నిర్మాణలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ నిర్మాలను కూల్చేవేసింది. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన పనులపై ప్రభుత్వానికి హైడ్రా ఓ నివేదికను సమర్పించింది. ఇందులో హైడ్రా చేపట్టిన వివరాలను పేర్కొంది.

మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. జూన్ 27 నుంచి పలు నిర్మాణాలను తొలగించినట్లు వివరించింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు కూల్చగా… రాజేంద్రనగర్‌ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను తొలగించినట్లు ప్రస్తావించింది.

 

టాపిక్

HyderabadHydraRanganath IpsTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024