OTT Malayalam Comedy Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇదే

Best Web Hosting Provider In India 2024


OTT Malayalam Comedy Movie: మలయాళం సినిమా లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో ఓ సెటైరికల్ కామెడీ మూవీ రాబోతోంది. మలయాళంలో గతేడాది ఆగస్ట్ లో రిలీజైన ఈ సినిమా.. ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా పేరు జలధార పంప్‌సెట్ సిన్స్ 1962. ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

జలధార పంప్‌సెట్ సిన్స్ 1962 ఓటీటీ

మలయాళ సెటైరికల్ కామెడీ మూవీ అయిన జలధార పంప్‌సెట్ సిన్స్ 1962లో సీనియర్ నటి ఊర్వశి నటించింది. థియేటర్లలో గతేడాది ఆగస్ట్ 11న రిలీజైనా పెద్దగా సక్సెస్ సాధించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత ఇప్పుడు అంటే ఆదివారం (సెప్టెంబర్ 15) నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని సదరు ఓటీటీ వెల్లడించింది. “ఆమె సుదీర్ఘ కాలంగా న్యాయం కోసం పోరాడింది. ఎప్పటికైనా మృణాళిని తనకు అనుకూలంగా తీర్పును పొందుతుందా? జలధారి పంప్‌సెట్ సిన్స్ 1962 మూవీ సెప్టెంబర్ 15 నుంచి కేవలం జియో సినిమాలో చూడండి” అనే క్యాప్షన్ తో జియో సినిమా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది.

జలధార పంప్‌సెట్ సిన్స్ 1962 మూవీ గురించి..

జలధార పంప్‌సెట్ సిన్స్ 1962 ఓ మలయాళ సెటైరికల్ కామెడీ డ్రామా. ఈ సినిమాను ఆశిష్ చిన్నప్ప డైరెక్ట్ చేశాడు. అతనికిదే తొలి సినిమా. మూవీలో ఊర్వశి, ఇంద్రన్స్ లీడ్ రోల్స్ ప్లే చేయగా.. సానుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవివంటి వాళ్లు నటించారు.

ఈ సినిమా ఓ వెరైటీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ఇంట్లో పంప్ సెట్ చోరీకి గురైందంటూ మృణాళిని (ఊర్వశి) కోర్టుకెక్కుతుంది. ఆ కేసు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉంటుంది. అసలు ఆమెకు న్యాయం జరుగుతుందా? ఆ పంప్ సెట్ కథేంటన్నది మూవీలోనే చూడాలి.

ఈ సినిమా గతేడాది ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజైంది. అయితే తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర ఓ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. కేవలం నెల రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం విశేషం. కేరళలోని పాలక్కడ జిల్లా కొల్లెన్‌గోడ్ లోనే మొత్తం సినిమాను షూట్ చేశారు.

ఓటీటీల్లోని లేటెస్ట్ మలయాళం మూవీస్

ఓటీటీల్లోకి ఈ వారమే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు వచ్చాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్ కూడా ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పట్టాపాకల్ అనే మరో డార్క్ కామెడీ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చింది.

కామెడీ సినిమా విశేషం కూడా ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో ఓటీటీలో ఆహా అనే ఓ మలయాళ సినిమా మూడేళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024