OTT Telugu Movie: ఓటీటీలోకి వచ్చేసిన రూరల్ యాక్షన్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024


హీరో, దర్శకుడు, నిర్మాత బండి సరోజ్ కుమార్.. తన ఆలోచనలు, భావాలతో ఇండిపెంటెండ్‍గా చిత్రాలు చేస్తుంటారు. విభిన్న అంశాలతో సినిమాలను చేస్తుంటారు. ఆయన చిత్రాలను స్వయంగా ప్రొడ్యూజ్ చేసుకుంటారు. బండి సరోజ్‍కుమార్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన చేసిన మాంగల్యం సహా కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్స్ అని కూడా కొందరు ప్రశంసిస్తారు. తాజాగా, బండి సరోజ్ కుమార్ నుంచి ‘పరాక్రమం’ సినిమా వచ్చింది. ఆగస్టు 23న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, తక్కువ థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి మోస్తరు టాక్ వచ్చింది. ఇప్పుడు పరాక్రమం చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

పరాక్రమం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (సెప్టెంబర్ 14) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ చిత్రంలో ఆహా అడుగుపెట్టింది. దీంతో ఈ చిత్రాన్ని చూడాలనుకొని థియేటర్లలో మిస్ అయిన వారు.. ఆహాలో ఇప్పుడు చూసేయవచ్చు.

పరాక్రమం సినిమాలో బండి సరోజ్‍ కుమార్‌తో పాటు శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, అనిల్ కుమార్, నిఖిల్ గోపు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకత్వం, నిర్మాత, సంగీత దర్శకుడు కూడా సరోజ్ కుమారే. తన మార్క్ డైలాగ్‍లు, నరేషన్‍తో ఈ చిత్రాన్ని ముందుకు నడిపారు. పరాక్రమం చిత్రానికి వెంకట్ ఆర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేశారు.

పరాక్రమం స్టోరీలైన్

డ్రామాల్లో నటిస్తూ పాపులర్ అయిన లోవరాజు (బండి సరోజ్ కుమార్) చుట్టూ పరాక్రమం మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో సరోజ్ డ్యుయల్ రోల్ చేశారు. కాకినాడలోని లంపకలోవ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న లోవరాజు.. హైదరాబాద్‍లోని రవీంద్ర భారతిలో నాటకం వేయాలని ప్రయత్నిస్తుంటాడు. పరాక్రమం అనే నాటకాన్ని ఆయన తండ్రి సత్తిబాబు (సరోజ్ కుమార్) రాసి ఉంటారు. దాన్నే రవీంద్ర భారతిలో ప్రదర్శించాలని లోవరాజు పట్టుదలగా ఉంటారు. అక్కడే నాటకం ప్రదర్శించాలని లోవరాజు ఎందుకు బలంగా నిర్ణయించుకుంటాడు? గతంలో ఏం జరిగింది? ఇతడి కథలో బుజ్జమ్మ (శృతి సమన్వి) పాత్ర ఏంటి? అనేవి పరాక్రమం చిత్రంలో ఉంటాయి.

‘బాలు గాని టాకీస్’ వాయిదా

ఆహా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు రావాల్సిన ‘బాలు గాని టాకీస్’ వాయిదా పడింది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ రూరల్ కామెడీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్‍కు రావాల్సింది. అయితే, ఆలస్యం అవుతుందని ఆహా ఇటీవలే వెల్లడించింది. సెప్టెంబర్ చివరి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. బాలు గని టాకీస్ చిత్రంలో శివరామచంద్రవరపు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024