Hyderabad : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

Best Web Hosting Provider In India 2024


శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడీ కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.

అసలు వివాదం ఏంటీ..

అరెకపూడి గాంధీని ఇటీవల పీఏసీ ఛైర్మన్‌గా నియమించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ ఎలా ఇస్తారని ఆక్షేపించింది. అయితే.. తాను నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ ఇచ్చామని అధికార కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మట్లాడారు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై అరెకపూడి గాంధీ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. అన్నట్టుగానే భారీ కాన్వాయ్‌తో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.

అరెకపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్ ఇంటికి పోలీసులు గేటు వేశారు. కొందరు అరెకపూడి గాంధీ అనుచరులు గోడ దూకి.. లోపలి నుంచి గేటు తీశారు. ఈ సమయంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అటు కౌశిక్ ఇంట్లో పూల కుండీలు, అద్దాం ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా హరీశ్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి హైదారాబాద్ సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కాసేపటికి బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు.

పాడి కౌశిక్ రెడ్డి కూడా గాంధీ ఇంటికి వెళతానని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారు పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌కు రావాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యి.. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. హరీశ్ రావు సహా.. కీలక నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ భగ్గుమంది. ఈ నేపథ్యంలో.. తాజాగా అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.

టాపిక్

BrsCongressHyderabadTs PoliceTs PoliticsTelangana NewsTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024