Best Web Hosting Provider In India 2024
Sandeep Reddy Vanga Devara Team Interview: ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాగా దేవర బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దేవరపైనే ఉంది. దీంతో ఈ మూవీ తెగ బజ్ క్రియేట్ చేసుకుంటుంది.
విలన్‌గా సైఫ్
అలాగే, ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవర. అంతేకాకుండా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ మూవీతోనే తెలుగులో పరిచయం కానుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ రీజన్‌తో దేవర మూవీపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. దీనికి తోడు దేవరలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించడం మరో హైలెట్‌గా నిలవనుంది.
ఇన్ని ప్రత్యేకతలతో ఇప్పటికే దేవర మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా కానుండగా.. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ స్పెషల్ ఇంటరాక్షన్ మరింత ప్రత్యేకంగా మారింది. దేవర మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర పార్ట్ 1 ట్రైలర్ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో దేవర రిలీజ్ కానుంది.
చాలా భయంగా ఉంటుంది
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా దేవర టీమ్‌ను సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. “కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు” అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది.
“దేవర ఒక యాక్షన్ డ్రామా” అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. టీజర్‌లోని హాఫ్ మూన్ అలా ఫుల్ మూన్‌గా మారడం గురించి సందీప్ రెడ్డి అడిగాడు. “మనం చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ లాగా” అని కొరటాల శివ అంటే.. “అంతే చాలు” అని తారక్ ఆపేశాడు. దాంతో కొరటాల శివతోపాటు అంతా నవ్వేశారు. “నిజానికి జాన్వీ క్యారెక్టర్ రాయడం చాలా టఫ్” అని కొరటాల శివ చెప్పారు.
అది సందీప్ అడుగుతున్నాడు
“అసలు నాకు స్టోరీ లైనే పూర్తిగా చెప్పలేదు” అని జాన్వీ కపూర్ చెప్పింది. “మీకు ఏమైనా లైన్ గుర్తుందా” అని సందీప్ అడిగితే.. “నాకు తెలుసు ఇది మీరు అడుగుతారు” అని సైఫ్ అలీ ఖాన్ బదులిచ్చాడు. దాంతో అంతా నవ్వేశారు. “దేవర పార్ట్ 1 రన్‌టైమ్ ఎంత” అని సందీప్ అడిగితే.. “రన్‌టైమ్ గురించి సందీప్ అడుగుతున్నాడు” అని కొరటాల శివ అన్నాడు.
“యానిమల్ రన్‌టైమ్ ఎంత సర్. 315..” అని తారక్ అంటే.. “మూడు గంటల 24 నిమిషాలు” అని సందీప్ చెప్పాడు. “పెద్ద రన్ టైమ్” అని తారక్ నవ్వుతూ చేతులతో సైగ ద్వారా తెలిపాడు. “మీరు ఫస్ట్ పార్ట్‌లో చంపబడతారా.. లేకపోతే సెకండ్ పార్ట్లోనా” అని సైఫ్ అలీ ఖాన్‌ను ప్రశ్నించాడు సందీప్ రెడ్డి. దానికి ఆన్సర్ చెప్పకుండా సైఫ్ షాక్ అయినట్లు ఆయన మొహన్ని బ్లాక్ చేసి ప్రోమోలో చూపించారు.
చాలా కాంప్లికేటెడ్
“అండర్ వాటర్‌లో 35 రోజుల షూటింగ్ చాలా కాంప్లికేటెడ్. షార్క్‌తో ఫైట్ సీక్వెన్స్‌తో పిచ్చిలేపుతుంది” అని తారక్ అంటే.. “కాంప్లికేట్ అనేది నెగెటివ్‌గా చెప్పినట్లు అవుతుంది” అని కొరటాల అన్నారు. “షార్క్ గట్టిగా కొట్టుంటే అందరం అక్కడే పేలిపోయే వాళ్లం” అని ఫైర్ సీక్వెన్స్ గురించి జాన్వీ కపూర్ చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits