నందిగామ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ..


ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.11-8-2022[గురువారం] ..

నందిగామ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ..

500 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ప్రజలకు మువ్వన్నెల జెండా లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

భారతదేశ స్వాతంత్రం – భారత జాతి సమైక్యతకు స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలి ..

నందిగామ నగర పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆజాదీ కా అమృత మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా” 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం నుండి 500 మీటర్ల జాతీయ జెండాతో , మువ్వన్నెల జెండాలతో విద్యార్థులు ,వాలంటీర్లు -సచివాలయ సిబ్బందితో నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ,శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కలిసి జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారని, విద్యార్థులందరూ చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయభావం అలవర్చుకోవాలని,సమాజ సేవ చేస్తే దేశానికి సేవచేసినట్లేనని,ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని,మువ్వన్నెల పతాక రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరుపుకోవాలి అని కోరారు ,

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, డి.ఎస్.పి , సి ఐ -ఎస్ ఐ లు , ఎమ్మార్వో , ఏఈ , పలు పాఠశాలల విద్యార్థులు -ఉపాధ్యాయులు , నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *