Best Web Hosting Provider In India 2024
బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్‍తో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న కౌశిక్.. దేవర చిత్రం విడుదలయ్యే వరకు తనను బతికించాలని వైద్యులను వేడుకున్నారట. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు మీడియా సమావేశంలో ఇటీవల వెల్లడించారు. కన్నీరు పెట్టుకుంటూ తమ కుమారుడి పరిస్థితిని వివరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ అంశం ఎన్టీఆర్ వరకు చేరింది. దీంతో ఆయన స్పందించారు.
నేను మాట్లాడకపోతే ఎలా..
ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న కౌశిక్‍తో వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్‌ను చూడగానే కౌశిక్ ఒక్కసారిగా ఆనందంతో నవ్వారు. “అసలు మిమ్మల్ని చూస్తానని అసలు అనుకోలేదన్నా” అని సంబరపడ్డారు. దీంతో “నవ్వుతూ ఉంటే బాగున్నావు” అంటూ తన అభిమానిని మరింత సంతోషపరిచారు ఎన్టీఆర్. “నేను మాట్లాకపోతే ఎలా” అని అన్నారు. ఎలా ఉన్నావంటూ ఆరా తీశారు. దీంతో ధైర్యంగా ఉన్నానని, చికిత్స పూర్తి చేసుకొని బయటికి వస్తానని నమ్మకంగా కౌశిక్ చెప్పారు.
సినిమాలు తర్వాత..
దేవర సినిమా ప్రస్తావన వచ్చాక.. “సినిమాలు తర్వాత.. ముందు ధైర్యంగా బయటికి రావాలి. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి” అని కౌశిక్‍తో ఎన్టీఆర్ చెప్పారు. ట్రీట్‍మెంట్ తీసుకొని ధైర్యంగా ఉంటూ కోలుకోవాలని సూచించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. దీంతో క్యాన్సర్ ఉన్న బాధను కూడా మరిచి నవ్వులు చిందించారు కౌశిక్.
అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడికి కొండంత ధైర్యం, సంతోషాన్ని కలిగించారని అంటున్నారు.
రిలీజ్‍కు రెడీ అయిన దేవర
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై హైప్ మరో రేంజ్‍లో ఉంది. అందులోనూ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వస్తోంది.
దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఓ చిన్న ప్రపంచాన్నే సృష్టించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్షన్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం యాక్షన్ మోత మోగిపోద్దని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎన్టీఆర్ కూడా హింట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది.
దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. సుమారు 2 గంటల 58 నిమిషాల రన్‍టైమ్‍తో ఈ మూవీ రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‍తో దేవర మూవీని నిర్మించాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits