Best Web Hosting Provider In India 2024
Rajasthan crime news: రాజస్థాన్ లోని కోటాలో ఓ కామెడీ ఈవెంట్ లో వైరు దొంగిలించాడని 12 ఏళ్ల దళిత బాలుడిని నగ్నంగా చేసి, బలవంతంగా డ్యాన్స్ చేయించి, రికార్డ్ చేసిన తండ్రీకొడుకులతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ పోలీసులు శనివారం తెలిపారు.
వైరల్ వీడియో
ఆ దళిత బాలుడు నగ్నంగా డాన్స్ చేస్తుండగా తీసిన వీడియోను నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బాలుడు ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా అక్కడ కూర్చున్న నలుగురైదుగురు ఆ బాలుడిన డ్యాన్స్ చేయాలని బలవంతం చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనించిన కోటా పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు బాధితుడిని గుర్తించి నిందితులపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని అతని కుటుంబ సభ్యులను కోరారు.
వైర్ దొంగిలించాడని..
జీఏడీ సర్కిల్ లోని ఓ ఫెయిర్ లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కామెడీ కార్యక్రమానికి తన కుమారుడు హాజరయ్యాడని బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి నాలుగు గంటల మధ్య నలుగురైదుగురు వ్యక్తులు వైర్ దొంగిలించాడంటూ తన కుమారుడిపై దాడి చేశాడని ఆరోపించారు. నిందితులు తన కుమారుడిని నగ్నంగా చేసి డ్యాన్స్ చేయమని బలవంతం చేశాడని, దాన్ని రికార్డు కూడా చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆరుగురి అరెస్ట్
ఈ ఫిర్యాదు ఆధారంగా కోటా పోలీసులు ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను క్షితిజ్ గుర్జార్ (24) అలియాస్ బిట్టు, ఆశిష్ ఉపాధ్యాయ్ అలియాస్ విక్కు (52), అతని కుమారుడు యయాతి ఉపాధ్యాయ్ (24) అలియాస్ గుంగన్, గౌరవ్ సోనీ (21), సందీప్ సింగ్ (30) అలియాస్ రాహుల్ బన్నాషా, సుమిత్ కుమార్ సైన్ (25)గా కోటా పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు తమ మ్యూజిక్ సిస్టమ్ నుంచి వైర్ దొంగిలించాడని నిందితులు అనుమానించినట్లు కోటా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు.
Best Web Hosting Provider In India 2024
Source link