Best Web Hosting Provider In India 2024
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (state bank of india) దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఈ డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1497 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 4 లాస్ట్ డేట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 4, 2024న ముగుస్తుంది.
ఖాళీల వివరాలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 784 పోస్టులు
అర్హతలు
అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ లో ఆయా పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితిని తదితర వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు షార్ట్ లిస్టింగ్ – కమ్ టైర్డ్ / లేయర్డ్ ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటరాక్షన్ 100 మార్కులకు ఉంటుంది. ఇంటరాక్షన్ కోసం అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటరాక్షన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు సాధిస్తే మెరిట్ జాబితాలో వారి వయసును బట్టి ర్యాంకులు ఇస్తారు.
అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 2024 నవంబర్ నెలలో నిర్వహిస్తారు. పరీక్షలో 60 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం మార్కులు 100. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు. కేటగిరీల వారీగా, ఆన్లైన్ రాత పరీక్షలో వారి పనితీరు ఆధారంగా బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటరాక్షన్ కు పిలుస్తారు. ఇంటరాక్షన్ కు 25 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link